రాజ‌స్థాన్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ గెలుపు

SRH
SRH

జోధ్‌పూర్‌లోని మాన్ సింగ్ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 11 పరుగుల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ జట్టు 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.  హైదరాబాద్ బ్యాట్స్ మెన్లు కెప్టెన్ కేన్ విలియమ్సన్ 63, అలెక్స్ హేల్స్ 45, మనీష్ పాండే 16 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్స్ ఆర్చర్ మూడు వికెట్లు తీయగా, గౌతమ్ రెండు, ఉనాద్కట్, సోది ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు. 152 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ జట్టు బ్యాట్స్ మెన్లు అజింక్య రహానే 65, సంజు శామ్సన్ 40, లామ్రర్ 11 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లు కౌల్ రెండు వికెట్లు, సందీప్ శర్మ, తంఫి, రషీద్ ఖాన్, యూసఫ్ ఫటాన్ లు ఒక్కొక్కటి చొప్పున వికెట్లు తీశారు.