యుజువేంద్ర, రసూల్‌లకు ఇదొక అవకాశం: కోహ్లీ

KOHLI
KOHLI

యుజువేంద్ర, రసూల్‌లకు ఇదొక అవకాశం: కోహ్లీ

 

న్యూఢిల్లీ:యుజువేంద్ర చాహల్‌,పర్వేజ్‌ రసూల్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో సత్తా చాటేందుకు ఇంగ్లండ్‌తో జరిగే మూడు టి20 సిరీస్‌ ఒక అద్భుతమై అవకాశామని టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ వ్యాఖ్యానించాడు.మూడు టి20ల సిరీస్‌లో భాగంగా కోహ్లీ మీడియాతో మాట్లా డాడు.కాన్పూర్‌ వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో మొట్టమొదటి టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ టి20 జట్టులో పెద్దగా మార్పులు ఉండవని పేర్కొన్నాడు.ముఖ్యంగా అశ్విన్‌ స్థానంలో చోటు దక్కించుకున్న రసూల్‌కు ఇదొక చక్కటి అవకాశమని వివరించాడు.దేశీయ టి20 మ్యాచ్‌లతో పాటు ఐపిఎల్‌లో సత్తా చాటుతున్న యుజువేంద్ర చాహల్‌,రసూల్‌లు ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తారని పేర్కొన్నాడు.ఇక పర్వేజ్‌ రసూల్‌ విషయానికి వస్తే ఐపిఎల్‌లో తన కెప్టెన్సీలో ఆడాడని,ఈ ఇద్దరికీ ఈ సిరీస్‌ మంచి బ్రేక్‌ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షించాడు. టి20 సిరీస్‌లో సత్తా చాటుతారు: దేశీయ టోర్నీలలో సత్తా చాటిన విధంగానే ఈ టి20 సిరీస్‌లో వీరిద్దరు బౌలింగ్‌లో తప్పక దూసుకుపోతారని,ఈ ఏడాది మార్చిలో జరిగిన వరల్డ్‌ టి20 తరువాత ఒకే మ్యాచ్‌ కూడా ఆడని రైనా ఈ సిరీస్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.రైనాకు ఇంకా అద్భుతమైన అవకాశాలున్నాయని చెప్పిన కోహ్లీ జట్టులో నిలకడ లేనప్పుడే సమస్యలు వస్తాయని అవసరమైతే తాను ఓపెనర్‌గా వస్తానన్నాడు. బ్యాటింగ్‌ లైనప్‌లో టీమిండియాకు ఎన్నో ప్రత్యామ్నాయాలున్నాయని,తాను ఇప్పటికి రెండు సార్లు మాత్రమే ఓపెనింగ్‌ చేశానని కోహ్లీ వెల్లడించాడు.ఐపిఎల్‌లో పూర్తిగా ఓపెనింగ్‌ చేసిన అనుభవం తనకుందన్నాడు.టీమిండియా టెస్టులు, వన్డేల్లో మంచి ఫలితాలను సాధిస్తుందని, టి20ల్లోనూ ఆడే ఆటతీరును కనబరుస్తామని కోహ్లీ పేర్కొన్నాడు.