మూడో టెస్ట్‌లో డబుల్‌ సెంచరీ చేస్తా

ajinkya rahane
ajinkya rahane

– వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహాన
మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గౌండ్‌ వేదికగా జరిగే బాక్సింగ్‌ డే టెస్ట్‌ కోసం టీం ఇండియా సిద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచాయి. దీంతో ఈ మూడో టెస్ట్‌లో ఇరు జట్లు కచ్చితంగా విజయం సాధించి… సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని భావిస్తున్నాయి. కాగా ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో తమ జట్టు కచ్చితంగా రాణిస్తుందని టీం ఇండియా వైస్‌కెప్టెన్‌ అజింక్యా రహానే ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాక.. ఈ టెస్ట్‌లో తాను సెంచరీ లేదా… డబుల్‌ సెంచరీ కచ్చితంగా చేస్తానని అన్నాడు. తాజాగా ఓ మీడియా సమావేశంలో రహానే మాట్లాడుతూ… నేను నాకు నచ్చిన విధంగా బ్యాటింగ్‌ చేస్తా. నాకు స్కోర్‌ చేయడం ముఖ్యం కాదు. కానీ అడిలైడ్‌, పెర్త్‌లలో నేను ప్రత్యర్థిని ఎదురుకున్న విధానాన్ని చూసి.. నాకు నమ్మకం వచ్చింది. ఈ మ్యాచ్‌లో నేఉ 100 లేదా 200 పరుగులు చేయొచ్చు. ప్రస్తుతం సిరీస1-1గా ఉండటం చాలా ఆనందంగా ఉంది. పెర్త్‌లో మాకున్న అవకాశాన్ని చేజార్చుకున్నాం. కానీ ఇప్పుడు డిసెంబర్‌ 26న మంచి ఆరంభం ఇవ్వాలని అనుకుంటున్నాం. బ్యాటింగ్‌ యూనిట్‌గా మేం.. బౌలర్లకు మద్దతు ఇవ్వాలి. సౌతాప్రికా సిరీస్‌ నుంచి భారత్‌ బౌలర్లు ప్రతీ మ్యాచ్‌లో ప్రత్యర్థులను రెండు ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ చేస్తున్నారు.ఆ పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌ కూడా సహకరిస్తే.. ఫలితం మరోలా ఉండేది. రానున్న రెండు టెస్టుల్లో బ్యాట్స్‌మెన్లు బాధ్యతగా ఉంటారని అనుకుంటున్నా. అని రహానే అన్నాడు. కాగా మూడో టెస్ట్‌ డిసెంబర్‌ 26వ తేదీన ఉదయం 5గంటలకు (భారత కాలమానం ప్రకారం) ప్రారంభం కానుంది.