ముంబయిలోని ఇమ్రాన్‌ ఖాన్‌ చిత్రపటంపై పరదా

IMG
IMG

ముంబయిలోని ఇమ్రాన్‌ ఖాన్‌ చిత్రపటంపై పరదా

న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిని దేశం మొత్తం ముక్తకంఠంతో నిరసిస్తోంది. దాడిలో అసువులు బాసిన వీర జవాన్ల కుటుంబాలకి మద్ధతుగా నిలుస్తూ…వారికి ఆర్థిక సహాయం చేసేందుకు సెలబ్రిటీలు, కార్పోరేట్‌ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇప్పటికే వీర జవాన్ల పిల్లల చదువు బాధ్యతను తాను తీసుకుంటానని ప్రకటించగా…హర్యానా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేస్తున్న బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ తన నెల జీతం మొత్తాన్ని విరాళంగా ప్రకటించాడు. తాజాగా ముంబయిలోకి క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా (సిసిఐ)కూడా పుల్వామా దాడిపై వినూత్న రీతిలో నిరసన తెలిపింది. సిసిఐలో ఉన్న దిగ్గజాల గ్యాలరీలో కపిల్‌దేవ్‌ పక్కన ఉన్న పాకిస్తాన్‌ మాజీ క్రికెటర, ప్రస్తుత ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చిత్రపటంపై పరదాని కప్పి ఉంచింది. క్రికెట్‌ రాజకీయాలు వేరు..మేము ఎప్పుడూ వాటిని కలపదలుచుకోలేదు. కానీ…తాజాగా పుల్వామా దాడి దేశ ప్రజల్ని కలచివేస్తోంది. అందుకే…ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని తాము ఇమ్రాన్‌ఖాన్‌ చిత్రపటంపై పరదా కప్పి నిరసన తెలియజేసినట్లు సిసిఐ అధ్యక్షుడు ప్రేమాల్‌ ఉడాని వెల్లడించారు.