మినీ ఐపిఎల్‌కు తాత్కాలిక బ్రేక్‌

3

మినీ ఐపిఎల్‌కు తాత్కాలిక బ్రేక్‌

లాడర్‌ హిల్‌: ఇటీవల అమెరికాలో వెస్టిండీస్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లు పెద్దగా విజయవంతం కాలేకపోవడంతో విదేశాల్లో నిర్వహించాలనుకున్న మినీ ఐపిఎల్‌కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అమెరికాకు క్రికెట్‌ మార్కెట్‌ ఏమిటో తెలిపేలా చేసిన అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడంతో వెస్టిండీస్‌తో జరిగి టి20 సిరీస్‌ అనుకున్న విధంగా ఆదరణ దక్కలేదు. దీంతో విదేశాల్లో సెప్టెంబర్‌లో ఏర్పాటు చేయాలని భావించిన మినీ ఐపిఎల్‌ ప్రణాళికలను ప్రస్తుతానికి వాయిదా వేసినట్లు బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్‌ ఠాకూర్‌ స్పష్టంచేశాడు. ప్రధానంగా మ్యాచ్‌ల సమయం విషయంలో అనుకూలత లేకపోవడమే మినీ ఐపిఎల్‌ ఆలోచనను పక్కకు పెట్టినట్లు ఆయన పేర్కొన్నాడు.విదేశాల్లో టోర్నీలు నిర్వహించేటపుడు సమయంలో వ్యత్యాసాన్ని తప్పకుండా మనం అర్థం చేసుకోవాలి.భారత్‌లో జరిగే ఐపిఎల్‌ రాత్రి 7 గంటల నుంచి 11.30 నిముషాల వరకు జరుగుతుంది. అమెరికా పగటి మ్యాచ్‌లు జరిగితే భారత్‌లో ఆ మ్యాచ్‌లు రాత్రి వేళల్లో చూస్తారు. ఇక్కడ బ్రాడ్‌ కాస్టింగ్‌ అనేది చాలా పెద్ద సమస్య.మనం విదేశాల్లో టోర్నీలు జరుపుతున్నప్పుడు భారత అభిమానులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. విదేశాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు భారత్‌లో టివి ద్వారా చూసే వీక్షకులను వదులుకోకూడదు. ప్రత్యేకంగా యుఎస్‌లో మ్యాచ్‌లు జరిగే టప్పుడు అక్కడ ఏ రాష్ట్రంలో మ్యాచ్‌లు ఆడుతున్నాము అనేది కూడా ముఖ్యం.కాకపోతే మా ముందు చాలా ఆప్షన్లు ఉన్నాయి. దానిపై పూర్తి కసరత్తు చేసిన తరువాత మినీ ఐపిఎల్‌పై వివరాలను వెల్లడిస్తాం, ప్రస్తు తానికైతే ఆ టోర్నీకి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్దం చేయడం లేదు అని ఠాకూర్‌ పేర్కొన్నాడు.గత జూన్‌లో విదేశాల్లో మినీ ఐపిఎల్‌ నిర్వహిస్తామంటూ బిసిసిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే.యుఎస్‌లో కానీ,యుఎఒలో కానీ మినీ ఐపిఎల్‌ నిర్వహించాలని బిసిసిఐ భావించినా తాజాగా ఠాకూర్‌ వ్యాఖ్యలతో ఆ టోర్నీ అమెరికాలో జరిగే అవకాశం లేదని అర్థం చేసుకోవచ్చు.