మాపై ఒత్తిడి లేదు…అత్రుత‌గా ఉంది….

newziland team
newziland team

కాన్పూర్‌:భారత్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మూడు వన్డేల సిరీస్‌లో ఇరు జ‌ట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్‌ వేదికగా జరిగే మూడో వన్డే రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది. అయితే శ‌నివారం కివీస్ అటగాళ్ల ప్రాక్టీస్ అనంత‌రం ఆ జ‌ట్టు స‌భ్యుడు టిమ్ సౌథీ మీడియాతో మాట్లాడుతూ ‘ఒత్తిడి లేదు! మాలో అంతకన్నా ఎక్కువగా ఆత్రుత ఉంది.  మేం చాలా ఉత్సాహంగా ఉన్నట్టు అనిపిస్తోంది. పటిష్ఠ జట్లు ఇక్కడికొచ్చి ఉత్త చేతులతో తిరిగి వెళ్లాయి. మేం సిరీస్‌ గెలిస్తే బాగుంటుంది. కానీ సొంతగడ్డపై భారత్‌ గట్టి జట్టు. రెండు జట్ల బలాబలాలు రెండు బృందాలకు తెలుసు. కాన్పూర్‌ పిచ్‌ భిన్నంగా ఉండి సవాళ్లు విసిరేలా కనిపిస్తోంది. ఇక్కడి పరిస్థితులకు మేం ఎంత త్వరగా అలవాటు పడితే అంత బాగా బౌలింగ్‌ చేయగలం. ముంబయి, పుణెతో పోలిస్తే  ఇక్కడ అంతగా వేడిమి లేదు. చల్లగానే ఉంది. సిరీస్‌లో మా ఆటగాళ్లు బాగా నే ఆడుతున్నారు’ అని సౌథీ తెలిపారు.