మాజీ స్పిన్నర్‌ జోషి పేరు సూచించిన కుంబ్లే

kumble
kumble

మాజీ స్పిన్నర్‌ జోషి పేరు సూచించిన కుంబ్లే

న్యూఢిల్లీ: తమకు ఒక మంచి స్పిన్‌ కన్సల్టెంట్‌ కావాలని కోరుతూ టీమిండియా ఛీప్‌ కోచ్‌ కుంబ్లేను బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారులు కలిశారట.దీంతో భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషిని కలవా లంటూ వారికి కుంబ్లే సలహా ఇచ్చాడట.ఈ నేపదజ్యంలో సునీల్‌ జోషిని బంగ్లా క్రికెట్‌ బోర్డు అధి కారులు కలిశారు.త్వరలోనే స్పిన్‌ కన్సల్టెంట్‌గా జోషిని నియమించేందుకు అవకాశాలు కనిప ిస్తున్నాయి.ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధికారి అక్రమ్‌ఖాన్‌ మాట్లాడుతూ నాణ్యమైన స్పిన్‌ కోచ్‌ను సూచించాలంటూ కుంబ్లేను అడిగామని దానికి అతను జోషిని సూచించాడని వివరించాడు.ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే ఉన్న జోషితో చర్చలు జరుపుతున్నామని పేర్కొన్నాడు.భారత్‌ తరపున 15 టెస్టులు,69 వన్డేలకు సునీల్‌ జోషి ప్రాతినిదజ్యం వహించాడు.టెస్టుల్లో 41 వికెట్లు తీయగా,వన్డేల్లో 69 వికెట్లు తీసుకున్నాడు.దేశవాళీ క్రికెట్‌లో 160 మ్యాచ్‌లు ఆడిన జోషి 615 వికెట్లు తీసుకున్నాడు.