మాకు పొవారే కావాలి.. బిసిసిఐకి హర్మన్‌ ప్రీత్‌, స్మృతి లేఖలు!

harman preet kaur, smruti mandhana
harman preet kaur, smruti mandhana

మిథాలీని తప్పించడం ఏకగ్రీవ నిర్ణయం బిసిసిఐకి హర్మన్‌ప్రీత్‌, స్మృతి లేఖలు
మిథాలీ రాజ్‌, మాజీ కోచ్‌ రమేష్‌పొవార్‌ వివాదం సమసిపోయినట్టే కనిపించినా తాజాగా మరోర మలుపు తిరిగింది. టీ 20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన జోడీ పొవార్‌కు మద్దతుగా నిలిచింది. అతడి ఆధ్వర్యంలో జట్టు మెరుగ్గా ఆడిందని..కోచ్‌గా మరికొంత కాలం కొనసాగించాలని వీరిద్దరు బోర్డుకు లేఖ రాయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
మహిళల క్రికెట్‌ జట్టుకు నూతన కోచ్‌ కోసం బిసిసిఐ ప్రకటన విడుదల చేయడంతో ఇక రమేష్‌ పొవార్‌కు ద్వారాలు మూసుకపోయినట్టే అని అంతా భావించారు. సీనియర్‌ బ్యాట్స్‌వుమెన మిథాలీ రాజ్‌తో అతడి వ్యవహారశైలి వివాదాస్పదమైన విషయం తెలిసిందే. గత నెల 30తో పొవార్‌తో ఒప్పందం ముగిసింది. దీన్ని పొడిగించేందుకు బిసిసిఐ కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే టీ20 ప్రపంచకప్‌ వరకు అతడికే బాధ్యతలు అప్పగిస్తే మంచిదని కోరారు. అలాగే మిథాలీని ఆడించకపోవడంపై లేఖలో వివరించింది. కొన్ని నెలలుగా మా జట్టు ఆటతీరులో ఎలాంటి మార్పు వచ్చిందో మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ప్రపంచ టాప్‌ జట్లకు దీటుగా ప్రదర్శన ఇవ్వగలిగాం. దీనికంతటికీ కారణం రమేష్‌ పొవార్‌ శిక్షణే. స్వల్పకాలంలోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు సాంకేతికంగా, వ్యూహాత్మకంగా భారత మహిళల జట్టును సమూలంగా మార్చాడు. ఇక సెమీస్‌లో ఓటమితో పాటు ఆ మ్యాచ్‌ చుట్టూ వివాదాలు నెలకొనడం మరితంగా బాధించింది. మిథాలీని తప్పించడం జట్టు వ్యూహంలో భాగంగానే జరిగింది. కెప్టెన్‌గా నేను, వైస్‌కెప్టెన్‌, కోచ్‌ సెలెక్టర్‌ అంతా కలిసి మేనేజర్‌ సమక్షంలో ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయమది. వచ్చే టీ20 ప్రపంచకప్‌కు మరో 15 నెలల సమయమే ఉంది. మరోర నెలలో న్యూజిలాండ్‌ టూర్‌కు వెళ్లాలి. ఈ నేపథ్యంలో జట్టు ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని మరో కొత్త కోచ్‌ కాకుండా పొవార్‌నే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అని లేఖలో హర్‌మన్‌ప్రీత్‌ పేర్కొంది. అటు స్మృతి ఊడా పొవార్‌ ఆధ్వర్యంలోనే జట్టు వరుసగా 14 టీ20 మ్యాచ్‌లను నెగ్గిందని గుర్తు చేసింది.