భారత్‌ జోరు కొనసాగాలి

CK KHANNA-
CK KHANNA-

భారత్‌ జోరు కొనసాగాలి

న్యూఢిల్లీ: శ్రీలంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్‌ గెలిచిన భారత జట్టు…ఈ ఏడాది ఇంగ్లాండ్‌ పర్యటనలోనూ అదే జోరు కొనసాగిస్తుందని బిసిసిఐ తాత్కాలిక అధ్యక్షుడు సికె ఖన్నా ధీమా వ్యక్తం చేశారు.జూలై 3 నుంచి భారత జట్టు ఇంగ్లాండ్‌ గడ్డపై పర్యటించనుంది. అక్కడ ఇంగ్లాండ్‌తో మూడ టీ20లు మూడు వన్డేలు, ఐదు టెస్టు సుదీర్థ సిరీస్‌ను ఆడనుంది. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌ని చేజార్చు కున్నా…వన్డే, టీ20 సిరీస్‌లు గెలిచి సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టి భారత్‌…అదే జోరుని ముక్కోణపు టీ20 సిరీస్‌లోనూ కొనసాగించింది. ఈ టోర్నీలో లంకతో తొలి మ్యాచ్‌లో ఓడినా…తర్వాత పుంజుకుని వరుస విజయాలతో విజేతగా నిలిచింది. దీంతో….భారత జట్టుకి అబి µనందనలు తెలిపిన సికెఖన్నా..

ఈ విజయాల బాట ఇంగ్లాండ్‌లోనూ కొనసాగాలని అభిలాషిం చారు. కొలంబోలో భారత్‌ అద్భుతమైన విజయా న్ని అందుకుంది. జట్టు కోచ్‌ రవిశాస్త్రితో పాటు స మిష్టిగా రాణించిన జట్టులోని ఆటగాళ్లం దరికీ నా అభినందనలు. విజయాల పరంపరతో మరపు రాని గెలుపుని అందుకున్నారు. ముఖ్యంగా ఒత్తిడి లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన దినేశ్‌ కార్తీక్‌కి నా ప్రత్యేక అభినందనలు. ఇంగ్లాండ్‌ గడ్డపై కూడా ఇదే జోరును భారత్‌ కొనసాగిస్తుందని నా నమ్మక మని సికె ఖన్నా ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభంకానున్న ఐపిఎల్‌ 2018 సీజన్‌. ..మే 27 వరకు కొనసాగనుంది. అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్‌కి బయిల్దేరనుంది.