బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌కు పిలుపు

SACHIN

ఒలింపిక్స్‌ ఇండియన్‌ టీమ్‌
బ్రాండ్‌ అంబాసిడర్‌గా
సచిన్‌కు పిలుపు
ఎఆర్‌ రెహ్మాన్‌ను చేర్చుకునే దిశగా ఐఒఎ
న్యూఢిల్లీ : బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలోలో ఆగస్టు 5  నుంచి 21 వరకు నిర్వహించనున్న 2016 ఒలింపిక్స్‌ ఇండియన్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌ను నియమించాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్ (ఐఒఎ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఒఎ సచిన్‌తో సంప్రదింపులు జరుపుతుంది.

RAHAMAN
కాగా రియో ఒలింపిక్స్‌లో ఇండియన్‌ టీమ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌లలో ఒకరిగా వ్యవహరించాల్సిందిగా ఐఒఎ సచిన్‌కు లేఖ రాసింది.దీనిపై సచిన్‌ స్పందన కోసం ఐఒఎ ఎదురు చూస్తుంది. దీనిపై సచిన్‌ నుంచి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నారు. సచిన్‌ సహా భారత ప్రసిద్ద సంగీత దర్శకుడు ఎఆర్‌ రహమాన్‌ను కూడా భారత్‌ నుంచి బ్రాండ్‌ అంబాసిడర్‌ల టీమ్‌లో చేర్చాలని ఐఎఒ భావిస్తుంది.