బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో డివిలియ‌ర్స్‌దే అగ్ర‌స్థానం

devilliers
devilliers

దుబాయ్ః టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్థానాన్ని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ లాగేసుకున్నాడు. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో డివిలియర్స్ 879 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి కోహ్లీ స్థానాన్ని ఆక్రమించాడు. ఫలితంగా 877 పాయింట్లతో కోహ్లీ రెండో స్థానానికి పరిమితమయ్యాడు.నాలుగు నెలల తర్వాత తిరిగి జట్టులో చేరిన డివిలియర్స్ బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో 176 పరుగులు బాది కెరీర్‌లోనే అత్యుత్తమ స్కోరు నమోదు చేశాడు. దీంతో ఎకాఎకిన రెండు స్థానాలు ఎగబాకాడు. భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి ఏడో స్థానంతో సరిపెట్టుకోగా ధోనీ 12, ధవన్ 14 స్థానాల్లో కొనసాగుతున్నారు.
బౌలింగ్‌లో పాక్ బౌలర్ హసన్ అలీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 743 పాయింట్లతో ఆరు స్థానాలు ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలీ అగ్రస్థానికి చేరుకోవడం ఇదే తొలిసారి. టీమిండియా బౌలర్లు బుమ్రా(671), అక్షర్ పటేల్‌ (663) లు చెరో స్థానం కోల్పోయి 6, 8 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.