బోపన్న, దబ్రోవ్‌స్కిపై సానియా జోడి విజయం

SANIA
SANIA

బోపన్న, దబ్రోవ్‌స్కిపై సానియా జోడి విజయం

మెల్‌బోర్న్‌: భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా జోడీ ఆస్ట్రేలియ ఓపన్‌లో దూసుకెళ్లింది.మిక్స్‌డ్‌ డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సానియా, ఇవాన్‌ దొడిగ్‌(క్రొయేషియా)జంట 6-4,3-6,12-10తో బోపన్న, దబ్రో వ్‌స్కి(కెనడా)పై గెలుపొందింది.దీంతో సీజన్‌ మొదటి టోర్నమెంట్‌ ఆస్ట్రేలియా ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్లో ప్రవేశించింది.బోపన్నజోడి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికి సానియా జంట దూకు డుగా ఆడి విజయం సాధించింది.దీంతో ఆస్ట్రేలియా ఓపెన్‌లో బోపన్న పోరాటం ముగిసింది. మరో క్వార్టర్స్‌లో భారత టెన్నిస్‌ దిగ్గజంలియాండర్‌ పేస్‌,మార్టినాహింగీస్‌(స్విట్జర్లాండ్‌) జంట స్థానిక జోడి సుమంత, సామ్‌ గ్రోత్‌లతో తలపడనుంది.ఇందులో విజయంసాధించిన జంట సానియా జోడీ సెమీస్‌లో పోరాడనుంది.