బిసిసిఐపై హాసీన్‌ మండిపాటు

Haseen jahan
Haseen jahan

న్యూఢిల్లీ: బిసిసిఐపై భారత్‌ పేసర్‌ మహమ్మద్‌ షమీ భార్య హాసీన్‌ జహాన్‌ తీవ్ర స్థాయిలో ఆగ్రహాం వ్యక్తం చేసింది. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలపై బిసిసిఐ జరిపిన దర్యాప్తు తీరును తప్పుపట్టారు. బిసిసిఐ దర్యాప్తు బృందం షమీ ప్రవర్తనను బిసిసిఐ పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. అతడి వ్యక్తిగత విషయాలను బిసిసిఐ పక్కన పెట్టేసిందని విమర్శించారు. అతడు మళ్లీ అడతాడు సరే, అతడి ప్రవర్తన మాటేమిటి? షమీ గుణాన్ని ఏమాత్రం పట్టించుకోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అతడి వ్యక్తి జీవితం గురించి బిసిసిఐ ఏమాత్రం పట్టించుకోలేదని హాసీన్‌ పేర్కొన్నారు. హాసీన్‌ ఆరోపణలపై దర్యాప్తు జరిపిన బిసిసిఐ అవినీతి నిరోధక శాఖాధికారులు షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని తేల్చి చెప్పారు. దీంతో బిసిసిఐ షమీ కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించింది. అలాగే ఐపిఎల్‌లో ఆడేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.