ఫిఫా అండ‌ర్ -17 మ్యాచ్‌కు గంగూలీ, స‌చిన్‌

sachin and ganguly
sachin and ganguly

కోల్‌క‌త్తాః భార‌త‌దేశంలో మొద‌టిసారి జ‌రుగుతున్న అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ టోర్న‌మెంట్ ఫిఫా అండ‌ర్‌-17 ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ చివ‌రి అంకానికి చేరుకుంది. అక్టోబ‌ర్ 28, శ‌నివారం నాడు ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ కోల్‌క‌తాలో జ‌ర‌గ‌నుంది. ఇంగ్లండ్ – స్పెయిన్ దేశాల జ‌ట్ల‌ మ‌ధ్య జ‌రగ‌నున్న ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కి భార‌త దేశ మాజీ క్రికెట‌ర్లు సౌర‌వ్ గంగూలీ, స‌చిన్ టెండూల్క‌ర్‌లు హాజ‌రుకానున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన సెమీ ఫైన‌ల్ మ్యాచుల్లో బ్రెజిల్‌పై ఇంగ్లాండ్‌, మాలి పై స్పెయిన్‌ విజయం సాధించి ఫైన‌ల్‌కి చేరుకున్నాయి. ఈ ఫైన‌ల్ మ్యాచ్ కోసం పశ్చిమ బెంగాల్ చేస్తున్న ఏర్పాట్లు తుదిస్థాయికి చేరుకున్నాయి. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు ఫిఫా అధ్యక్షుడు జియానో ఇన్‌ఫాంటినో హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం.