ప్రాక్టీస్‌ వన్డేలో న్యూజిలాండ్‌ ఓటమి

Indian Bats man
Indian Bats man

ప్రాక్టీస్‌ వన్డేలో న్యూజిలాండ్‌ ఓటమి

న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటనని ఓటమితో న్యూజి లాండ్‌ ఆరంభించింది. భారత్‌ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ జట్టుతో మంగళవారం జరిగిన తొలి ప్రాక్టీస్‌ వన్డేలో 30 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ పరా జయం చవిచూసింది. ఓపెనర్లు పృథ్వీ షా (80బం తుల్లో 9ఫోర్లతో 66 పరుగులు), కెఎల్‌ రాహుల్‌ (75బంతుల్లో 12 ఫోర్లతో 64 పరుగులు)తో పాటు కరుణ్‌ నాయర్‌ (64 బంతుల్లో 12 ఫోర్లతో 78 పరుగులు) అర్థశతకాలు బాదడంతో తొలుత బ్యా టింగ్‌ చేసిన ప్రెసిడెంట్స్‌ జట్టు నిర్ణీతీ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనతో తడబడిన కివీస్‌…భారత బౌలర్లు నదీమ్‌ (3/41),జయదేవ్‌ ఉనద్కత్‌ (3/62) ధాటికి 47.4ఓవర్లలోనే 265 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులో టామ్‌ లోథమ్‌ (63బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు), కెప్టెన్‌ విలియమ్సన్‌ (49 బంతుల్లో 7ఫోర్లతో 47 పరుగులు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఛేదన ఆరంభంలోనే కివీస్‌ ఓపెనర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (20బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 పరుగులు) హిట్లింగ్‌తో బౌలర్ల లయ దెబ్బ తీసేందుకు ప్రయత్నించగా, ధవళ్‌ కులకర్ణి అతడ్ని ఔట్‌ చేసి జట్టుకి శుభారంభమిచ్చాడు.

అనంతరం వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మరో ఓపెనర్‌ మున్రో (26)తో కలిసి స్కోరు బోర్డుని నడిపించాడు. అయి తే స్పిన్నర్‌ కర్ణ్‌శర్మ కెప్టెన్‌ని బుట్టలో వేయగా, మున్రోని నదీమ్‌ ఔట్‌ చేశాడు. తర్వాత వచ్చిన రాస్‌ టేలర్‌ (52బంతుల్లో ఒక ఫోర్‌తో 34 పరుగులు) మరీనెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడంతో కివీస్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో చివర్లో శాంట్నర్‌ (26), గ్రాండ్‌ హోమ్‌ (33) పోరాడిన ఫలితం లేకపో యింది. రెండో ప్రాక్టీస్‌ వన్డే గురువారం జరగనుంది. భారత్‌ ప్రధాన జట్టుతో ఆదివారం వాంఖడే వేడికగా తొలి వన్డేలో న్యూజిలాండ్‌ ఢీకొననుంది. ఇదిలాఉంటే అక్టోబర్‌ 22 నుంచి భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు ముందు కేన్‌విలి యవ ు్సన్‌ నేతృత్వంలోని న్యూజిలాండ్‌జట్టు బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌జట్టుతో రెండువార్మప్‌ మ్యాచ్‌లు ఆడుతోంది.