ప్రాక్టీస్‌తో చెమ‌టోడుస్తున్న టీమిండియా

practice
practice

శ్రీలంకతో జ‌రిగిన వ‌న్డే సిరీస్‌లో అద‌ర‌గొట్టిన టీమిండియా టీ20 సిరీస్‌కి సిద్ధ‌మైంది. రేపు కటక్ వేదికగా తొలి టీ20 జ‌ర‌గ‌నుంది. మైదానంలో చెమ‌టోడుస్తూ కొత్త ఆట‌గాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. సీనియర్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రహానె, భువనేశ్వర్ కుమార్ తదితరులు టీ20లో ఆడ‌డం లేదు. కేఎల్ రాహుల్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ స్థానంలో వ‌చ్చే అవ‌కాశం ఉంది. శ్రేయాస్ అయ్యర్‌, మనీశ్ పాండే, సిరాజ్, బ‌సిల్ తంపి రేప‌టి టీ20లో ఏ మేర‌కు రాణిస్తారో చూడాలి. ప‌లువురు కొత్త కుర్రాళ్లు మైదానంలో క‌ఠోర సాధన చేస్తోన్న వీడియో, ఫొటోను బీసీసీఐ అభిమానుల‌తో సోష‌ల్ మీడియాలో పంచుకుంది.