పేలవ పిచ్‌పై బిసిసిఐకి జరిమానా

UMPAIre
Umpire

పేలవ పిచ్‌పై బిసిసిఐకి జరిమానా

లండన్‌: భారత్‌ఆస్ట్రేలియా తొలి టెస్టుకు ఆతిథ్యమిచ్చిన ఎంసిఎ స్టేడియం పేలవంగా ఉందని ఐసిసి మ్యాచ్‌ రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ నివేదిక ఇచ్చింది.ఈ నేపథ్యంలో బిసిసిఐకి ఐసిసి సుమారు 19,500 ఆస్ట్రేలియా డాలర్లు జరి మానా విధించినట్లు సమాచారం.బ్రాడ్‌ ఇచ్చిన నివేదిక ఇప్పటికే బిసిసిఐకి అందింది.దీనిపై బిసిసిఐ 14 రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. బిసిసిఐ చీఫ్‌ క్యూరేటర్‌ దల్జిత్‌ సింగ్‌ ఆదేశాల మేరకే పుణే క్యూరేటర్‌ పాండురంగ్‌ పిచ్‌ని తయారు చేసినట్లు మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.రెండు సంవత్సరాల కిందట భారత్‌,దక్షిణాఫ్రికా టెస్టుకు ఆతిథ్యమిచ్చిన నాగ్‌పూర్‌ పిచ్‌ కూడా సరిగా లేదని రిఫరీ నివేదిక ఇవ్వగా అప్పుడు ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చింది.అప్పుడు కూడా బిసిసిఐ చీఫ్‌ క్యూరేటర్‌గా దల్జిత్‌ సింగ్‌ ఉన్నాడు.బిసిసిఐ స్పందించిన తరువాత పిచ్‌ విషయంలో హెచ్చరించడమా? జరిమాన విధించడమా అన్న దానిపై బిసిసిఐ నిర్ణయం తీసుకోనుంది.