పాక్‌ అభిమానికి స్టెయిన్‌ దిమ్మతిరిగే సమాధానం…

Dale Steyn
Dale Steyn

పెర్త్‌: దక్షిణాఫ్రికా బౌలింగ్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ మైదానంలోనే కాదు….సోషల్‌ మీడియాలో సైతం పదునైన బౌన్సర్లు సంధిస్తున్నాడు. ఎటకారం ఎక్కువై కామెంట్‌ చేసిన ఓ పాకిస్తాన్‌ అభిమానికి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌క స్టెయిన్‌ విశ్రాంతినిచ్చాడు. ఈనేపథ్యంలో స్టెయిన్‌ ఇప్పటివరకు జరిగింది చాలు. ఈటెస్టు హాయిగా నా సోఫాలో కూర్చొని ఆస్వాదిస్తా. నేనిప్పుడు కుర్చి విమర్శకుడినయ్యాను అంటూ ట్వీట్‌ చేశాడు. దీనికి ఓ పాక్‌ అభిమాని అత్యుత్సాహంతో ”అవును, ఈటెస్టు సిరీస్‌లో బాబార్‌ అజమ్‌ నీ బౌలింగ్‌లో చితక్కొట్టినప్పుడు…నీకు కచ్చితంగా విరామం కావాల్సిందేఅంటూ ఎటకారంతో రిప్లే ఇచ్చాడు. దీనికి స్టెయిన్‌ దిమ్మతిరిగే సమాదానం ఇచ్చాడు. ”అవును టెస్టు సిరీస్‌ 3-0తేడాతో గెలవడమే నిజంగా చితక్కొట్టించకోవడమే అంటూ చురకలంటించాడు. ఈ సమాధానంతో సదరు అభిమాని ‘నేను నా దేశం పరువు తీసినందుకు క్షమించండి. కానీ నాకు ఆ దిగ్గజం నుంచి రిప్లే కోసం అలా ట్వీట్‌ చేశాను అని పేర్కొన్నాడు. కాగా స్లెయిన్‌ రిప్లే నెటిజన్లను ఆకట్టుకుంది. మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెట్టే స్టెయిన్‌…సోషల్‌ మీడియా ట్వీట్లతో అదరగొట్టాడు అంటూ నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. బాబర్‌ అజమ్‌ క్రికెట్‌లోకి వచ్చిన బచ్చాగాడని, స్టెయిన్‌ దిగ్గజ బౌలరని సదరు అభిమానికి హితవు పలుకుతున్నారు. కామెంట్‌ చేసేముందు ఒళ్లు దగ్గర పెట్టుకొని చేయాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.