పట్నాను ఓడించిన ముంబాయి

U Mumbai
U Mumbai

సోనెపట్‌: ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌లో పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యు ముంబా విజయం సాధించింది. పట్నాను 51-41తో చిత్తు చేసింది. మ్యాచ్‌లో ఆది నుంచి ముంబాయిదే అధిపత్యం. సారథి పర్థీప్‌ నర్వాల్‌ 25 సార్లు రైడ్‌కు వెళ్లి 21 పాయింట్లు సాధించగా, రెండో భాగంలో పట్నా రేసులోకి వచ్చింది. ఈ దశలో ఆ జట్టును మూడు సార్లు ఆలౌట్‌  చేసిన ముంబాయి ఆఖరికి విజయం సాధించింది. ముంబాయి స్టార్‌ ఆటగాడు కాళీలింగ్‌ ఆడకే 15 రైడ్‌ పాయింట్లతో చెలరేగాడు.