నేను ఎద‌గ‌డానికి ధోనీనే కార‌ణంః బ్రావో

BRAVO, DHONY
BRAVO, DHONY

ధోనీ త‌నపై ఉంచిన న‌మ్మ‌కం వల్లే త‌ను మెరుగ్గా రాణించ‌గలుగుతున్నాన‌ని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆట‌గాడు డ్వేన్ బ్రావో వెల్ల‌డించాడు. ఆట‌గాడిగా తను ఎంతో మెరుగుప‌డ‌డానికి, చివ‌రి ఓవ‌ర్ల స్పెష‌లిస్ట్ బౌలర్‌గా ఎద‌గ‌డానికి ప‌రోక్షంగా ధోనీయే కార‌ణ‌మ‌ని బ్రావో చెప్పాడు. ఒక సీజ‌న్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా రెండుసార్లు బ్రావో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. దీని వెనుక ధోనీ ఉన్నాడ‌ని చెన్నైలో జ‌రిగిన స‌మావేశంలో బ్రావో చెప్పాడు.