నా అభిమాన క్రికెట‌ర్లు కోహ్లీ, హషీమ్ , డివిలియర్స్ః అజామ్‌

Babar Azam
Babar Azam

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 
కరాచీ: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి.. తనకు ఏమాత్రం పోలిక లేదని పాకిస్థాన్‌ యువ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌
పేర్కొన్నాడు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌ అని, తాను ఇంకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నానని అజామ్‌ తెలిపాడు. కొద్ది రోజుల
క్రితం అజామ్‌ ఓ క్రీడా ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ఈ సందర్భంగా ఓ అభిమాని, మీ అభిమాన
ఆటగాడు ఎవరని అడగ్గా ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లీ, హషీమ్‌ ఆమ్లా అని తెలిపాడు. అనంతరం మరో అభిమాని
అజామ్‌ను పాకిస్థాన్‌ కోహ్లీగా పిలవచ్చా అని అడగ్గా.. ‘మా ఇద్దరి మధ్యా పోలికే లేదు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌. నేను
ఇంకా కెరీర్‌ ప్రారంభంలోనే ఉన్నాను. పాకిస్థాన్‌ బాబర్‌ అజామ్‌గా పిలుపించుకోవడమే నాకు ఇష్టం’ అని అజామ్‌
పేర్కొన్నాడు. 22ఏళ్ల అజామ్‌ ఇప్పటివరకు పాక్‌ తరఫున 9 టెస్టులు, 31 వన్డేలు ఆడాడు.