నన్ను కోహ్లీతో పోలుస్తారేంటి?

KOHLI-1

నన్ను కోహ్లీతో పోలుస్తారేంటి?

ఇస్లామాబాద్‌: భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీతో తనని అస్తమానం పోల్చుతుండటంతో పాకిస్తాన్‌ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బాబర్‌ అజామ్‌ ఒకింత మెరుగైన బ్యాటింగ్‌తో అజామ్‌ ఆకట్టుకుంటు న్నాడు. ఇప్పటికే బ్యాట్స్‌మెన్‌గా నిరూపించుకున్న కోహ్లీతో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న తనని పోల్చడం సరికాదని అజామ్‌ సూచించాడు. కొద్దిరోజుల క్రితం అజామ్‌ ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపం చంలోనే నంబర్‌ వన్‌ క్రికెటర్‌గా ఎదగాలన్నది నాకోరికన్నాడు. పాకిస్తాన్‌ కోచ్‌ మిక్కి ఆర్థర్‌ ఇటీవల మాట్లాడుతూ బాబర్‌ అజామ్‌ యంగ్‌ గన్‌. అతను ప్రత్యేకమైన క్రికెటర్‌? కెరీర్‌ ఆరం భంలో విరాట్‌ కోహ్లీ ఎలా ఉండేవాడో ఇప్పుడు అజామ్‌ అలానే ఆడుతున్నాడు. ఇది అతిపెద్ద ప్రశంస అని నాకు తెలుసు. కానీ…దీనికి అతను అర్హుడే అని వెల్లడించాడు. ఈ ప్రశంసపై తాజాగా అజామ్‌ స్పందించాడు.

విరాట్‌ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మెన్‌. నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నా. మా ఇద్దరి మధ్య పోలికలు ఎలా ? నన్ను బాబర్‌ అజామ్‌గా గుర్తిస్తే చాలు. నేను కోహ్లీలా ఆడటం లేదు. నాకంటూ ప్రత్యేక శైలి ఉంది. కెరీర్‌లో కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. వాటిని అనుసరించి అడుగు లేస్తున్నా. కానీ ఎప్పటికైనా కోహ్లీలా జట్టుకి ఉపయోగపడే ఇన్నింగ్స్‌లు ఆడా లని ఉందని అని అజామ్‌ వెల్లడించాడు. ట్విట్టర్‌లో అజామ్‌ అభి మానులతో స్వయంగా ఛాటింగ్‌లో పాల్గొన్నాడు. ఈసందర్భంగా ఓ అభిమాని మీ అభిమాన ఆటగాడు ఎవరని అడుగ్గా ఎబి డివిలియర్స్‌్‌, విరాట్‌ కోహ్లీ, హషీమ్‌ ఆమ్లా అని తెలిపాడు. తాను క్రికెట్‌ను ఎంచుకునేందుకు తన అంకుల్‌ కారణమని ఆయనతో కలిసి వీధుల్లో క్రికెట్‌ ఆడిన సంఘటనలు ఇంకా గుర్తు ఉన్నాయని ఓ అబి µమాని అడిగిన ప్రశ్నకు అజామ్‌ సమాధానం ఇచ్చాడు.