ధోనీ కంటే జోస్‌ బట్లర్‌ బెస్ట్‌

BUTLER-
BUTLER

ధోనీ కంటే జోస్‌ బట్లర్‌ బెస్ట్‌

వన్డే, టీ20ల్లో భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కంటే ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్‌/బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ అత్యుత్తమంగా ఆడుతున్నాడని ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైనా అభిప్రాయపడ్డాడు. తాజాగా ఆస్ట్రేలియాతో ముగిసిన ఐదో వన్డేలో అజేయ శతకం బాదిన జోస్‌ బట్లర్‌ (122 బంతుల్లో 12ఫోర్లు, ఒక సిక్సర్‌తో 110 నాటౌట్‌0 ఒంటిచేత్తో ఇంగ్లాండ్‌ని గెలిపించాడు. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌ 29.4 ఓవర్లు ముగిసే సమయానికి 114/8 ఓటమి అంచుల్లో నిలిచింది. కానీ…ఈ దశలో అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడిన బట్లర్‌…ఆదిల్‌ రషీద్‌ (47బంతుల్లో 20 పరుగులు)తో కలిసి 8వ వికెట్‌కి 81 పరుగుల భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌ ఓటమి తప్పించాడు. దీంతో…ఐదు వన్డేల సిరీస్‌ని ఇంగ్లాండ్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేయగలిగింది.

మ్యాచ్‌ అనంతరం బట్లర్‌ ఇన్నింగ్స్‌పై టిమ్‌ పైనీ మ మాట్లాడుతూ జోస్‌ బట్లర్‌ చాలా బాగా ఆడాడు. వన్డే, టీ20ల్లో ఇప్పుడు అతనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ / బ్యాట్స్‌మెన్‌. ప్రస్తుతం అతనికి దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేరేమో అనిపిస్తోంది. మహేంద్రసింగ్‌ ధోని కూడా మంచి వికెట్‌ కీపర్‌ / బ్యాట్స్‌మెన్‌. కానీ…గత కొద్దిరోజుల నుంచి జోస్‌ బట్లర్‌ అతని కంటే అత్యుత్తమంగా ఆడుతున్నాడు. వన్డేల్లో మ్యాచ్‌ గమనానికి అనుగుణంగా ఆడటమెలాగో బట్లర్‌ చక్కగా అర్థం చేసుకుంటున్నాడని ప్రశంసించాడు.ఈ వన్డే సిరీస్‌లో మొత్తం 275 పరుగులు చేసిన బట్లర్‌…మూడు మ్యాచుల్లో 91, 54, 110 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌ కంటే ముందు జరిగిన ఐపిఎల్‌ 2018 సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరుపున ఆడిన బట్లర్‌…దాదాపు 600 పరుగులతో రాణించాడు.