ద్రవిడ్‌ సలహా కెరీర్‌ను మలుపు తిప్పింది

Vijay Shankar , Rahul dravid
Vijay Shankar , Rahul dravid

ద్రవిడ్‌ సలహా  కెరీర్‌ను మలుపు తిప్పింది

న్యూఢిల్లీ: తమిళనాడు క్రికెటర్‌, ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ తరుపున ఆడుతున్న విజ§్‌ు శంకర్‌కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది. భారత జట్టులో చోటు దక్కడం పట్ల ఈ ఆల్‌రౌండర్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఆనందంలో ఓ క్షణం పాటు మైండ్‌ బ్లాంక్‌ అయ్యిందని తెలిపాడు. విజ§్‌ు శంకర్‌ గతంలో ఆఫ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేసేవాడు.

ఓసారి తన ఆరాధ్య క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బౌలింగ్‌ చేసే అవకావం లభించింది. చెపాక్‌లో రాహుల్‌కు బౌలింగ్‌ చేయడం విజ§్‌ుకు కాస్త బెరుకుగా అనిపించింది. బంతిని సరిగా విసరలేకపోయాడు. అతడి ఇబ్బందిని గమనించిన ద్రవిడ్‌ బంతిని అందిస్తూ…భయపడకు, నీ బౌలింగ్‌ యాక్షన్‌ నాకు నచ్చింది. లెంగ్త్‌ బాగుంది. కానీ కొంచెం అదనపు వేగంతో విసురు అని సలహా ఇచ్చాడు. బ్యాటింగ్‌లోనూ ద్రవిడ్‌ విజ§్‌ు కిటుకులు నేర్పాడు.

ద్రవిడ్‌ మాటలతో విజ§్‌ు ఆలోచనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచే పేస్‌ బౌలింగ్‌ చేయడం ప్రారంభించానని తెలిపాడు. మొదట్లో ఆఫ్‌ స్పిన్‌ నుంచి మీడియం పేస్‌కు మారడం ఇబ్బందిగా తోచింది. కానీ అదే అతడికి జట్టులో చోటు దక్కేలా చేసింది. తమిళనాడు జట్టలోనూ ఎక్కువమంది స్పిన్నర్లు ఉన్నారు. వారంతా మీడియం పేస్‌ బౌలింగ్‌ చేయమని సలహా ఇచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు కోచ్‌ బాలాజీ సహకారంతో బౌలింగ్‌ యాక్షన్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాడు. హార్థిక్‌ పాండ్యా తరహాలో బ్యాట్‌తో దూకుడుగా ఆడకపోయినా…నిలకడగా పరుగులు రాబట్టగలడు. టెస్టు క్రికెట్‌కు సరిగ్గా సరిపోతాడనే కారణంతో అతడ్ని జట్టులోకి తీసుకున్నారు.