దీపావ‌ళికి డ‌బుల్ ధ‌మాకా, ఒకే వేదిక‌పై ఇద్ద‌రు స్టార్లు

Amir khan and Virat kohli
Amir khan and Virat kohli

ముంబయి: ఈసారి దీపావళి మరింత ప్రత్యేకం కానుంది. ఇద్దరు పెద్ద సెలబ్రిటీలు తొలిసారి ఒకే షోలో అలరించబోతున్నారు. బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌, టీం ఇండియా ర‌థసార‌థి విరాట్‌ కోహ్లీ. ఓ హిందీ టీవీ ఛానెల్‌ ఆమిర్‌, కోహ్లీతో చాట్‌ షో నిర్వహించబోతోంది.ఈ చాట్‌ షోలో కోహ్లీ, ఆమిర్‌ తమ వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకోబోతున్నారట. ఈ షోని దీపావళికి ప్రసారం చేయనున్నారు. ఈ షోతో ఛానెల్‌ టీఆర్పీ రేటింగ్స్‌ కూడా ఓ రేంజ్‌లో పెరగబోతున్నాయట. షో కోసం సదరు ఛానెల్‌ ఆమిర్‌, కోహ్లీకి భారీ మొత్తంలోనే పారితోషికం ఇచ్చినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.