తొలి వికెట్ కోల్పోయిన భార‌త్‌

Rohith sharma
Rohith sharma

దుబాయ్‌ : భార‌త్‌, హాకాంగ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్‌లో భార‌త్ తొలి వికెట్‌ను కోల్పోయింది. కాగా, ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన హాకాంగ్ బౌలింగ్ ఎంచుకోవ‌డంతో భార‌త్ బ్యాటింగ్ ప్రారంభించింది. రోహిత్ శ‌ర్మ‌, ధావ‌న్‌లు ఓపెన‌ర్లుగా క్రీజులోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్ద‌రూ ప్రారంభంలో ప‌రుగుల వ‌ర‌ద పారించిన‌ప్ప‌టికీ 45 పరుగుల వద్ద ఇషాన్ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ 22 ప‌రుగుల వ్యక్తిగ‌త స్కోరు వ‌ద్ద ఔట‌య్యాడు. ప్ర‌స్తుతం భారత్‌ స్కోరు 11 ఓవర్లకు 64/1 క్రీజులో ధ‌వ‌న్ (35), రాయుడు (5) ఉన్నారు.