తప్పుకోక తప్పదు.. ఇది నా నిర్ణయం కాదు

ARSEN VINGER
ARSEN VINGER

తప్పుకోక తప్పదు.. ఇది నా నిర్ణయం కాదు

ప్రీమియర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ల్లో ఒక్కటైన అర్సె నల్‌ కోచ్‌ కం మేనేజర్‌ ఆర్సెన్‌ వింగర్‌ జట్టు నుంచి నిష్క్రమించాల్సిన సమయం ఆసన్న మైందని వ్యాఖ్యా నించాడు. కానీ ఇది తన నిర్ణయం కాదన్నారు. ప్రీమియర్‌ లీగ్‌ క్లబ్‌ అర్సెనల్‌ జట్టుతో తనకు సుమారు 22 ఏళ్ల అనుబంధం ఉన్నదని తెలిపారు. నార్త్‌ లండన్‌ పరిధిలోని అర్సెనల్‌ క్లబ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అరెసనల్‌ వింగర్‌ కాంట్రాక్టు ముగియడానికి ఒక ఏడాదిముందే ఈసీజన్‌ ముగిసే సమయానికి ఎమిరేట్స్‌ వెళ్లనున్నట్లు గతవారం ప్రకటించాడు. నా నిష్క్రమణకు సంబంధించి తీసుకున్న నిర్ణయం స్వీయ నిర్ణయం కాదని అర్సెన్‌ వింగర్‌ తెలిపాడు. ప్రస్తుతం తాను విశ్రాంతి దశలో ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఛాంపియన్స్‌ లీగ్‌, ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీల్లో అర్సెనల్‌ జట్టు పేలవ ప్రదర్శనపై మద్ధ తుదారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నానని చెప్పాడు. దేశీయ ప్రీమియర్‌ లీగ్‌ టోర్నీలో అర్సెనల్‌ జట్టు ఆరో స్థానంలో నిలిచింది.

ఇది పూర్తిగా గుడ్‌బై చెప్పడమేమో అనేది కూడా తనకు సరిఆ్గ తెలియదన్నాడు. అర్సెనల్‌ జట్టు సభ్యులు చాలా ప్రత్యేకమైన వారని కొనియాడారు. తాను వారితో కలిసి ఫలితాలు సాధించాలని కోరుకున్నట్లు తెలిపాడు. సీజన్‌ ముగిసిన తర్వాత ఫుట్‌బాల్‌తోనే తన అనుబంధం కొనసాగుతుందా…? లేదా…? అనే విషయం తనకు తెలియదని అర్సెన్‌ వింగర్‌ అన్నాడు. మరేదైనా జట్టుకు మేనేజర్‌గా వెళ్లాలనే విషయాన్ని తానిప్పుడే చెప్పలేనని ఆలోచించలేదని అన్నాడు. నిజాయితీగా చెబుతున్నా. భవిష్యత్తులో నేనేం చేయగలనో నాకు తెలియదు. కొంతకాలం విశ్రాంతి తీసు కుంటానేమో..?నేను పనిచేయాలని మాత్రమే కోరుకుంటాను. ప్రస్తు త దశలో నా భవితవ్యం గురించి ఏమి చెప్పలేను. అర్సెనల్‌ ఫుట్‌ బాల్‌ క్లబ్‌ కంటే మెరుగైన సేవలందిస్తానా? లేదా? చెప్పలేనని పేర్కొన్నాడు.