డిసెంబర్‌ 4న భారత్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ పెళ్లి

Sunil
Sunil

డిసెంబర్‌ 4న భారత్‌ ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ పెళ్లి

న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్‌ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్‌లో సంగీత్‌ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్‌ 4న కోల్‌కతాలో జరగనుంది. రిసెప్షన్‌ డిసెంబర్‌ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీపూర్తి చేసింది. ఇక సునీల్‌ చెట్రి ఇండియన్‌ సూపర్‌లీగ్‌ 4 సీజన్‌లో బెంగళూరు ఎఫ్‌సికి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.