ట్రాక్‌ ఆసియాకప్‌ భారత్‌కు ద్వితీయ స్థానం

sp4

ట్రాక్‌ ఆసియాకప్‌ భారత్‌కు ద్వితీయ స్థానం

భారత్‌కు 16 పతకాలు ్దన్యూఢిల్లీ: ఐజి ఆడిటోరియంలో జరుగుతున్న ట్రాక్‌ ఆసియా కప్‌ సైక్లింగ్‌ క్రీడల్లో భారత్‌ 16 పతకాలు సాధించి రెండవ స్థానంలో నిలిచింది.కాగా ఇందులో 5 స్వర్ణ పతకాలు,4 కాంస్య పతకాలు,7 రజత పతకాలు ఉన్నాయి.భారత్‌ చివరి రోజున రెండు స్వార్ణ పతకాలు సహా మొత్తం8 పతకాలను సాధించింది.క్రీడల్లో భారత్‌ సైక్లిస్టులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని, పత్యేకించి జూనియర్‌ సైక్లింగ్‌ విభాగంలో క్రీడాకారులుతమ సత్తా కనబరిచారని కోచ్‌ ఆర్‌కె శర్మ పేర్కొన్నాడు.కాగా 2017 ఆసియా ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌కు ఇవి దిశానిర్దేశం చేస్తాయని శర్మ వెల్లడించాడు.