టెస్టులకు హఫీజ్‌ గుడ్‌బై

mohammad hafeez
mohammad hafeez

కరాచీ : పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన మహమ్మద్‌ హఫీజ్‌ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడోటెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హఫీజ్‌ డకౌట్‌ అయ్యాడు. దీంతో వెంటనే టెస్టులకు గుడ్‌బౌ చెబుతున్నట్టు ప్రకటించాడు. కివీస్‌తో జరుగుతున్న టెస్టు..హఫీజ్‌ కెరీర్‌లో 55వ మ్యాచ్‌ కానీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగుతానని తెలిపాడు. 38ఏళ్ల హఫీజ్‌ 54టెస్టుల్లో 38.35సగటుతో 3644 పరుగులు చేశాడు. అందులో 10శతకాలు, 12హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.203 వన్డేలు, 89టీ20లు కూడా ఆడాడు.