టీమిండియా క్రికెట్‌ కోచ్‌గా టామ్‌ మూడీ…?

s9
Tom modi

టీమిండియా క్రికెట్‌ కోచ్‌గా టామ్‌ మూడీ…?

న్యూఢిల్లీ : టీమిండియా క్రికెట్‌ కోచ్‌గా టామ్‌ మూడీ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల కోచ్‌ అనిల్‌ కుంబ్లే, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీల మధ్య నెలకొన్న విబేధాల నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తులు స్వీకరణ మే 31తో ముగిసింది. భారత్‌ మాజీ క్రికెటర్లు కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అయితే కోచ్‌ పదవి కోసం ఇప్పటివరకు ఎవరెవరకు దరఖాస్తులు చేసుకున్నారే విషయమై బోర్డు స్పందించలేదు. అయితే అధికార ప్రకటన లేకపోయినప్పటికీ దరఖాస్తు చేసుకున్న హై ప్రొపైల్‌ వ్యక్తుల్లో టామ్‌ మూడీ ఒకరని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కోచ్‌ ఎంపిక విషయంపై మాట్లాడిన ఓ బిసిసిఐ అధికారి ఒకరు టామ్‌ మూడీకి చాన్స్‌ ఉందని తెలిపినట్లు సమాచారం. తాజా పరిణామాలు ప్రస్తుతం సన్‌రైజర్స్‌ హైద్రాబాద్‌కు కోచ్‌గా ఉన్న మూడీకి లాభం చేకూర్చేలా ఉన్నాయని క్రికెట్‌ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. మూడీ గతంలో శ్రీలంక జట్టుతో పాటు వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా జట్లకు కోచ్‌గా కూడా వ్యవహరించారు. టామ్‌ మూడీ కోచ్‌గా ఉన్న సమయంలో శ్రీలంక 2007 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ వరకు చేరుకుంది.

ఈక్రమంలో ఆయన ఉపఖండం పిచ్‌లపై అవగాహన ఉంది. టామ్‌ మూడీ కోచ్‌గా ఉన్న సమయంలోనే సన్‌రైజర్స్‌ హైద్రాబాద్‌ ఐపిఎస్‌ విజేతగా కూడా అవతరించింది. ఐపిఎల్‌ పదో సీజన్‌లో కూడా క్వాలిఫియర్‌-2 వరకు చేరుకుంది. ఇంటర్వూలన్నీ ఇంగ్లాండ్‌లో..? ఇదిలా ఉంటే కోచ్‌ పదవికోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులన్నింటినీ బోర్డు సిఇఓ రాహుల్‌ జోహ్రీ లండన్‌లో ఉన్న క్రికెట్‌ సలహా కమిటీ సభ్యులకు అందించనున్నారు. ఇంటర్వూలన్నీ ఇంగ్లండ్‌లోనే జరపాలా..? లేదా..? అనే విషయం సిఎసి నిర్ణయిస్తుంది. ఇది పూర్తిగా వారికి సంబంధించిన విషయం. కుంబ్లే కూడా మరోసారి కమిటీ ముందు రావాలా అనేది కూడా వారే తేలుస్తారు. అని బోర్డు వర్గాలు తెలుపుతున్నాయి.