టీమిండియాతో పోరాడుతున్న బంగ్లాదేశ్‌

s4
indian Bangladesh test match

టీమిండియాతో పోరాడుతున్న బంగ్లాదేశ్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో టీమిండియా, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుంది.1 వికెట్‌కు 41 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడవ రోజు ఆట ప్రారం భించిన బంగ్లాదేశ్‌ జట్టు కేవలం ఆరు పరుగుల వ్యవధిలోనే తమీమ్‌ ఇక్బాల్‌ వికెట్‌ కోల్పోయింది. అనంతరం 109 పరుగులకు నాలుగవ వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ సమయంలో షకీబ్‌ అల్‌హసన్‌,ముష్పికర్‌ రహీమ్‌ అయిదవ వికెట్‌కు 107 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొ ల్పారు.నిలకడగా ఆడుతున్న షకీబ్‌,రహీమ్‌ హాఫ్‌ సెంచరీలు పూర్తి చేశారు.

అయితే షకీబ్‌ వ్యక్తిగత స్కోరు 82 పరుగుల వద్ద అతడిని అశ్విన్‌ ఔట్‌ చేశాడు.రహీమ్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడుతుండ టంతో మోహదీ హసన్‌ అతనికి సహకరిస్తున్నాడు. ప్రస్తుతం రహీమ్‌ 81 పరుగులు,హసన్‌ 51 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.ఈ మ్యాచ్‌ లో ఉమేష్‌ యాదవ్‌ ఒక్కడే రెండు వికెట్లు తీసు కోగా ఇషాంత్‌ శర్మ,అశ్విన్‌,జడేజా ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసుకున్నారు.శనివారం ఆట ముగిసే సమ యానికి ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లా 322 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లా ఇంకా 365 పరుగుల వెనుకబడి ఉంది.తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 6 వికెట్లకు 687 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసిన సంగతి తెలిసిందే. సత్తాచాటుతున్న కెప్టెన్‌ ముష్పికర్‌ రహీమ్‌ టీమిండియాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ లో బంగ్లాదేశ్‌ నిలకడగా ఆడుతుంది.మూడవ రోజు ఆట ముగిసే సమయానికి 104 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్‌ 6 వికెట్లు కోల్పోయి 322 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ ముష్పికర్‌ రహీమ్‌ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. దీంతో మూడవ రోజు క్రీజులో ముష్పికర్‌ రహీమ్‌ 81 పరుగులు,మోహిదీ హసన్‌ 51 పరుగులతో ఉన్నారు.1 వికెట్‌కు 41 పరుగులతో ఓవర్‌ నైట్‌ స్కోరుతో మూడవ రోజు ఆటను కొనసాగించిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు మొదట్లోనే దెబ్బ తీశారు.ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన షకీబ్‌, రహీమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరి ద్దరు కలిసి 107 పరుగుల భాగస్వామ్యాన్ని నెల కొల్పారు.

ఆ తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన షబ్బీర్‌ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలిం గ్‌లో ఎల్‌డిడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఆ తరువాత క్రీజులోకి వచ్చిన మహిదీ హాసన్‌, కెప్టెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. టి విరామ సమయానికి 6 వికెట్లకు 246 ఉప్పల్‌ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టి విరామ సమయానికి బంగ్లాదేశ్‌ ఆరు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. ముష్పికర్‌ రహీమ్‌ 47 పరుగులు,మెహిద్‌ హసన్‌ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.బంగ్లాదేశ్‌ ఇంకా తన తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులు వెనుకబడి ఉంది.అయిదవ వికెట్‌కు షకీబ్‌,ముష్పికర్‌లు 107 పరుగులు జోడించారు. బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబ్‌ శరవేగంగా 82 పరుగులు చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

భారత బౌలర్లలో ఉమేష్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీసుకోగా,అశ్విన్‌,జడేజా ఒక్కొక్కరు ఒక వికెట్‌ తీసుకున్నారు. షకీబ్‌ హాఫ్‌ సెంచరీ బంగ్లాదేశ్‌ ఆటగాడు షకీబ్‌ ఉల్‌ హసన్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.69 బంతుల్లో 10 బౌండ రీల సాయంతో షకీబ్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు.1 వికెట్‌కు 41 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బం గ్లాదేశ్‌ ఆరంభంలోనే కీలక వికెట్‌ కోల్పోయింది. మూడవ రోజు ఆటలో భాగంగా తమిమ్‌ ఇక్బాల్‌ వికెట్‌ను రనౌట్‌ రూపంలో బంగ్లా కోల్పోయింది.ఆ తరువాత మోమినుల్‌ హక్‌ 12 పరుగులు, మొహ్మదుల్లా 28 పరుగుల వద్ద ఔటయ్యారు.ఈ సమయంలో షకీబ్‌ ఉల్‌ హసన్‌,కెప్టెన్‌ రహీమ్‌లు ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలోనే షకీబ్‌ హాఫ్‌ సెంచరీ చేశాడు.