టామ్‌ మూడీని టార్గెట్‌ చేసి నాలుక కరుచుకున్న కామ్రెడ్‌లు

TOM MOODY
TOM MOODY

టామ్‌ మూడీని టార్గెట్‌ చేసి నాలుక కరుచుకున్న కామ్రెడ్‌లు

తిరువనంతపురం : ప్రధాని నరేంద్ర మోడీ మీద అక్కసుతో కేరళా వామపక్ష వాదులు టామ్‌ మూడీపై విమర్శలు గుప్పించి తర్వాత తీరిగ్గా నాలుక కరుచుకున్నారు. లెఫ్ట్‌ పార్టీ నేతలకు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కోచ్‌ టామ్‌ మూడీ, ప్రధాని మోడీ మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు కదా…! ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ ‘మూడీస్‌ 13 ఏళ్ల తర్వాత భారత్‌కు మెరుగైన రేటింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. గుర్తుంది కదా. అంతకుముందు ఇండియా బిఏఏ 3 రేటింగ్‌ ఉండగా…దాన్ని బిఏఏ 2కు ప్రమోట్‌ చేసింది. ఈ రేటింగ్‌ ఇచ్చిన మూడీస్‌ను టామ్‌ మూడీ అనుకొని కేరళకు చెందిన కొందరు లెఫ్ట్‌ పార్టీ నేతలు ఆయన్ను విమర్శిస్తూ మూడీ ఫేస్‌బుక్‌ పేజీలో విమర్శలకుదిగారు. ఇలా భారత ఆర్థికవ్యవస్థ రేటింగ్‌ పెంచినందుకు సిగ్గు పడమంటూ తిట్ల దండకాన్ని అందుకున్నారు. కొందరైతే..నీకు దమ్ముంటే కేరళ రా అని సవాల్‌ చేశారు. మొత్తానికి మూడీస్‌ తప్పు చేసిందని విమర్శించే తొందరలో కొందరు కమ్యూనిస్టులు అది టామ్‌ మూడీ అనే క్రికెటర్‌ పేస్‌బుక్‌ పేజీ అనే విషయాన్ని మరిచారు. తీరా తెలుసుకు న్నాక నాలుక కరుచుకున్నారు.