జ‌ట్టులో ఎవ‌రికి చోటు ద‌క్కినా జ‌ట్టు కోస‌మే ఆడాలిః ర‌హానె

Ajinkya Rahane
Ajinkya Rahane

ఆస్ర్టేలియాతో వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ టీ-20లకు వేటుకు గురైన అజింక్యా రహానె సెలెక్టర్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని అంటున్నాడు. అలాగే జట్టులో పోటీని తానెప్పుడూ ఆస్వాదిస్తానని చెబుతున్నాడు. టీ-20 సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు దక్కకపోవడంపై రహానెను ప్రశ్నించగా తానేమీ బాధపడడం లేదని చెప్పాడు. ‘ఇటీవల మేం మితిమీరిన క్రికెట్‌ ఆడిన మాట వాస్తవం. ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌, సెలెక్టర్లు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని గౌరవించాలి. అసలు పోటీ ఉంటేనే మనలోని అత్యుత్తమ ఆటను బయటకు తీసే అవకాశం ఉంటుంది. ఈ పోటీని ఆస్వాదిస్తాను. జట్టులో ఎవరికి చోటు దక్కినా జట్టు కోసమే బాగా ఆడాల’ని రహానె అన్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రహానె 4 అర్ధ సెంచరీలు సాధించాడు. అయితే తన ఫామ్‌ పట్ల సంతోషంగా ఉన్నానని ర‌హానె తెలిపాడు. తనపై ఉంచిన బాధ్యతను చక్కగా నెరవేర్చానని చెప్పాడు. తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని అన్నాడు. వెస్టిండీస్‌ పర్యటనలో అద్భుత ప్రదర్శన చేశానని.. అదే ఫామ్‌ను ఆసీస్‌తో వన్డే సిరీస్‌లోనూ కొనసాగిం చానని అన్నాడు.