చాంపియన్‌ ట్రోఫీ తరువాత క్రికెట్‌ నుంచి వైదొలగనున్న ధోనీ?

Dhono11
Dhono11

చాంపియన్‌ ట్రోఫీ తరువాత క్రికెట్‌ నుంచి వైదొలగనున్న ధోనీ?

న్యూఢిల్లీ: ఇప్పటికే టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల కెప్టెన్సీకు వీడ్కోలు పలికిన ధోని క్రికెట్‌ నుంచి పూర్తిగారిటైర్మెంట్‌ తీసుకోనున్నాడా? అంటే అవుననే అంటున్నారు.క్రికెట్‌కు ధోని శాశ్వతంగా వీడ్కోలు చెబుతాడా లేదా అనేది మరో మూడు నెలల్లో తేలిపోనుందట.ఈ విషయాన్ని ధోని చిన్ననాటి కోచ్‌ కేశవ్‌ బెనర్జీ పేర్కొన్నాడు.జూన్‌లో జరిగే చాపింయన్స్‌ ట్రోఫీ తరువాత ధోని తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవచ్చని కేశవ్‌ బెనర్జీ అభిప్రాయం వ్యక్తం చేశాడు.ప్రస్తుతానికి ధోని దృష్టంతాఆ టోర్నీపైనే ఉంది.అందులో బాగా ఆడ గలిగితే 2019 వరల్డ్‌ కప్‌ వరకు కూడా కొనసాగవచ్చు అని పేర్కొన్నాడు.అండర్‌-14క్రికెట్‌ టోర్నీ సందర్భంగా కేశవ్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడారు.ధోని వయసు పెరిగింది కాబట్టి ఆటలో ధాటి తగ్గడం సహజం.అయితే ఎవరూ వేలెత్తి చూపకముందే తన గురించి నిర్ణయం తీసుకోగలడు అని కేశవ్‌ ఐపిఎల్‌కు మార్ష్‌ దూరం న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో రైజింగ్‌ పుణే సూపర్‌ జెయిం ట్స్‌కు ఊహించిన ఇబ్బంది ఎదురైంది.ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ మార్ష్‌ తొమ్మిది నెలలు క్రికెట్‌కు దూరం కానున్నాడు.భుజం గాయం కారణంగా టీమిండియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌ నుంచి వైలగిన సంగతి తెలిసిందే.బెంగళూరు టెస్టులో గాయపడిన మార్ష్‌ మెరుగైన శస్త్ర చికిత్స కోసం స్వదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే.మార్ష్‌కు ఆపరేషన్‌ అనివార్యం కావడంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.అయితే వచ్చే వారంలో వైద్య నిపుణులను మార్ష్‌ సంప్రదించే అవకాశం ఉంది. ఆపరేషన్‌ గనుక అవసరమైతే సుమారు 9 నెలల పాటు క్రికెట్‌కు దూరం కావాల్సి వస్తుంది.ఈ క్రమంలో ఐపిఎల్‌ 10వ ఎడిషన్‌కు కూడా మార్ష్‌ దూరం కానున్నాడు.గత సీజన్‌లో అతను పుణేకు ప్రాతినిధ్యం వహించాడు.2009లో కూడా మిచెల్‌ మార్ష్‌ ఇదే కారణంతో కొన్నాళ్లు క్రికెట్‌కు దూరమైన సంగతి తెలిసిందే.మార్ష్‌కు గాయం తీవ్రతపై క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా తన అధికారిక ట్విటర్‌లో స్పందించింది.అంతకు ముందు భుజం గాయం కారణంగా మిచెల్‌ మార్ష్‌ మిగతా రెండు టస్టులకు దూరమవుతున్నట్లు ఆసీస్‌ ఫిజియో థెరపిస్టు డేవిడ్‌ పేర్కొన్నాడు.కొంత కాలంగా మిచెల్‌ మార్ష్‌ భుజం గాయంతో బాధపడు తున్నాడు. సమ్మర్‌ సీజన్‌లో చాలా వరకు ఇలానే ఆడాడు. ఇప్పటి వరకు ఇలాగే మేనేజ్‌ చేశాం. గాయం ఎక్కువ కావడంతో ఆడలేకపోతున్నాడు అని డేవిడ్‌ పేర్కొన్నాడు.