క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

TEAM INDIA1
TEAM INDIA

క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే ఆదివారం ప్రేమ్‌దాస్‌ స్టేడియం వేదికగా జరగనుంది. ఈవన్డేలో విజయం సాధిం చడం ద్వారా భారత్‌ సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేయాలని యో చిస్తోంది. అయితే, చివరి మ్యాచ్‌లో తప్పకుండా గెలుస్తామని శ్రీలంక ధీమాగా చెబతుంది. ఆదివారం మధ్యాహ్నం 2.30 గం.లకు ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆరంభం కానుంది.

ఈ క్రమంలోనే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌తో ముగించాలని విరాట్‌ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ఉవ్విళ్లూరుతుండగా, కనీసం ఒక గెలుపును సొంతం చేసుకుని పరువు నిలు పుకోవాలని లంకేయులు భావిస్తున్నారు. వరుసగా నాలుగు వన్డేల్లో విజయం సాధించి లంకప తిరుగులేని ఆధిక్యం సాధించిన విరాట్‌ సేన, మరో గెలపుతో వన్డే సిరీస్‌ను ఘనంగా ముగించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆదివారం మ్యాచ్‌లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే, భారత్‌ ముందు మరో సువర్ణావకాశం కూడా ఉంది. చివరి వన్డేలో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేస్తే మాత్రం ఈ దశాబ్ధపు కాలంలో రెండు జట్లను రెండు సార్లు 5-0తో వైట్‌ వాష్‌ చేసిన అరుదైన ఘనతను భారత్‌ సొంతం చేసుకుంటుంది. 2014లో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ 5-0తో చేజిక్కించుకుంది. స్వదేశంలో జరిగిన ఆ వన్డే సిరీస్‌లో భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇప్పుడు మరోసారి శ్రీలంకను వారి దేశంలో క్లీన్‌స్వీప్‌ చేసే అవకాశం దక్కింది. గత పదేళ్ల కాలంలో ఇంగ్లండ్‌ను భారత్‌ జట్టు 5-0తో ఓడించింది.

2008-09 సీజన్‌లో తొలిసారి ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌. 2012-13 సీజన్‌లో మరొకసారి వైట్‌ వాష్‌ చేసింది. ఆ తరువాత ఇంతకాలానికి మరొకరి జట్టును రెండోసారి 5-0తో క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశం శ్రీలంక రూపంలో టీమిం డియా ముంగిట ఉంది. భారత్‌తో వరుసగా నాలుగు వన్డేలు ఓడిన లంకేయులు, ఈ సిరీస్‌లో నేరుగా ప్రపంచకప్‌అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఈసిరీస్‌లో లంక కనీసం రెండు మ్యాచ్‌లు గెలిచి ఉంటే…ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించేది. ఇక మిగిలింది ఒక వన్డే మాత్రమే కాబట్టి లంక కేవలం పరువు నిలుపుకునే పనిలో పడింది. 2012లో శ్రీలంకలో చివరిసారి ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌లో భారత్‌ 4-1తో గెలిచింది. మరి ఇప్పుడు పేలవమైన ఫామ్‌తో ఉన్న శ్రీలంక కనీసం మ్యాచ్‌ను గెలవడం కష్టంగానే కనిపి స్తోంది. ఈ తరుణంలో భారత్‌ జట్టు క్లీన్‌స్వీప్‌ లాంఛనంగానే కనపడుతోంది.

చివరి వన్డేకు శిఖర్‌ ధావన్‌ దూరం: శ్రీలంకతో ఆఖరి వన్డేకు శిఖర్‌ దూరం కానున్నాడు. ధావన్‌ తల్లి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో శ్రీలంక నుంచి ఈ ఓపెనర్‌ భారత్‌కు పయనమైనట్లు వార్తలు వస్తున్నాయి. ధావన్‌ దూరమైతే…అతని స్థానంలో అజింక్యా రహానె తుది జట్లలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, అతను ఓపెనర్‌గా వస్తాడా…? లేదా మిడిలార్డర్‌ కెప్టెన్‌ కోహ్లీ అవకాశమిస్తాడో చూడాలి.ఎందుకంటే….ఈ సిరీస్‌ ముందు వరకు ఓపెన ర్‌గా ఉన్న కెఎల్‌ రాహుల్‌…గత నాలుగు వన్డేల్లోనూ మిడ ిలార్డర్‌లో బ్యాటింగ్‌చేశాడు.

కానీ….ఒకటి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేకపోవడంతో ఐదో వన్డేలో ధావన్‌ స్థానంలో రాహుల్‌ మళ్లీ ఓపెనర్‌గా వచ్చే ఛాన్స్‌లున్నాయి. ఒకవేళ రహానె అవకాశం దక్కక పోతే…కేదార్‌ జాదవ్‌ తుది జట్టులోకి రావొచ్చు. చివరి వన్డేలో సత్తా చూపిస్తాం :మాథ్యూస్‌: భారత్‌తో ఆదివారం జరగనున్న చివరి వన్డేలో సత్తా చూపిస్తామని శ్రీలంక మాజీ కెప్టెన్‌ మాథ్యూస్‌ ధీమా వ్యక్తం చేశాడు. గత గురువారం కొలంబోలో ముగిసిన నాలుగో వన్డేలో అర్థశతకంతో లంక పరువు కోసం ఒంటరి పోరాటం చేసిన మాథ్యూస్‌ (70) చివరికి పేలవ షాట్‌తో వికెట్‌ చేజార్చుకున్నాడు.

వ్యక్తిగతంగా వన్డేల్లో నా ప్రదర్శనపై తీవ్ర నిరాశలో ఉన్నానని మాథ్యూస్‌ అన్నారు. క్రీజులో వేగంగా కుదురుకుని పరుగులు రాబడు తున్నా…ఔటవుతున్న తీరు బాధిస్తోంది. ఇక సిరీస్‌లో ఒక మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే నా బ్యాటింగ్‌ తీరుతో నిరాశ విసుగు చెందాను. జట్టుకి విజయాలు అందిం చలేకపోయినా…కనీస ముద్ర వేయగలిగాననే సంతృప్తి మా త్రమే నాకు మిగిలింది. చివరి వన్డేలో శ్రీలంక తప్పకుం డా గెలిచి సత్తా చూపిస్తుందని మాథ్యూస్‌ ధీమా వ్యక్తం చేశారు.

మా జట్టుకు గెలుస్తామనే కాన్ఫిడెన్స్‌ జీరో : కోచ్‌ గుణవర్థనే
సొంతగడ్డపై భారత్‌ చేతిలో వరుస ఓటములు చవిచూస్తున్న శ్రీలంక జట్టులో ప్రస్తుతం గెలుస్తామనే మానసిక స్థైర్యం పూర్తిగా దెబ్బతిందని శ్రీలంక బ్యాటింగ్‌ కోచ్‌ గుణవర్ధనె నిరాశ వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లా డారు. ఇప్పటివకే ఐదు వన్డేల సిరీస్‌లో 0-4తో ఓటమి పాలైన శ్రీలంక నాలుగో వన్డేలో అటు బంతితోనే కాకుండా ఇటు బ్యాట్‌తోనూ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది. ఐదవ వన్డేకి సన్నద్ధమ య్యేం దుకు శ్రీలంక వద్ద ఎక్కువ సమయం లేకపోవ డంతో బ్యాటింగ్‌, బౌలింగ్‌పై ప్రిప రషన్‌ కంటే క్రికెటర్లని మానస ికంగా దృఢంగా మార్చేం దుకు ప్రయత్నించా. ఎందుకంటే గెలుస్తామనే ధీమా ప్రస్తు తం జట్టు లో పూర్తిగా దెబ్బతింది. అందుకే చివరి వన్డే కోసం జట్టులోని అందరికీ ప్రత్యేకంగా కొన్ని టార్గెట్స్‌ ఇచ్చాను. ఎంతమేరకు సఫలీకృతం అవుతామో చూడాలి మరి. ఆది వారం వన్డేలో సర్వశక్తులు ఒడ్డి గెలవాలనే పట్టుదలతో జట్టు ఉందని కోచ్‌ వివరించాడు.