క్రికెట‌ర్ మ‌యాంక్‌కు మోగిన పెళ్లి బాజా

Mayank Agarwal
Mayank Agarwal & Ashitha

బెంగళూరు: ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మయాంక్ అగర్వాల్ ఓ ఇంటివాడయ్యాడు. సోమవారం తన ప్రేయసి అషిత సూద్‌ను పెళ్లాడాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహానికి టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ హాజరయ్యాడు. అషితను చూడగానే మనసు పారేసుకున్న మయాంక్ ఐదు నెలల క్రితం ప్రపోజ్ చేశాడు. అషిత కూడా ఓకే చెప్పడంతో తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దల ముందు ఉంచారు. వారు కూడా ఓకే చెప్పడంతో సోమవారం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్దిమంది బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. కొత్త పెళ్లికొడుకు మయాంక్‌తో తీసుకున్న ఫొటోలను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి.