కోహ్లీ సేన‌కు కోచ్‌గా ఆశిష్ నెహ్రా

Ashish Nehra
Ashish Nehra

బెంగళూరు: గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పన టీం ఇండియా మాజీ పేసర్ ఆశీష్ నెహ్రా తాజాగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇండియా ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బౌలింగ్ కోచ్‌గా ఉన్న ఆయన ఆ జట్టు కొత్త కోచ్‌గా ఎంపికయ్యాడు. గత సీజన్‌లోనూ నెహ్రా గ్యారీ క్రిస్టన్‌తో కలిసి ఆ జట్టు కోచింగ్ బృందంలో సభ్యుడిగా ఉన్నారు.‘‘గతేడాది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కోచింగ్‌ బృందంలో చేరడం నాకు ఎంతో గౌరవంగా భావించి అంకితభావంతో పనిచేశా. నాకు ప్రధాన కోచ్ బాధ్యత అప్పగించిన జట్టు యాజమాన్యానికి ధన్యవాదాలు. రాబోయే సీజన్లలో జట్టును విజయం దిశగా నడిపించేందుకు కృషిచేస్తాను’ అని నెహ్రా అన్నారు. నెహ్రా టీం ఇండియా తరఫున రెండు ఐసీసీ ప్రపంచకప్‌లు, రెండు ఆసియా కప్‌లు, మూడు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో ఆడాడు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ అనంతరం నెహ్రా అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పి కోచ్‌గా కొత్త కెరీర్‌ని ప్రారంభించాడు.