కోహ్లీ లేకపోతే అంతేనా…?

india
india

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా ఘోర ఓటమి చెందడటం పట్ల నెటిజన్లు విమర్శలను ఎక్కుపెట్టారు. భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లేకుండా ఆడితే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటుందా అంటూ మండిపడుతున్నారు. కివీస్‌తో మూడు వన్డేల తర్వాత కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్న తరుణంలో టీమిండియా తాజా ఓటమిని ఓరకంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. కోహ్లీతో పాటు మొత్తం జట్టంతా ‘హాలిడే ప్రకటించినట్లు కనబడుతుందని ఎద్దేవా చేశారు. ఇంతటి దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంటే కోహ్లీలేని భారత జట్టును నమ్మడం ఎలా అని నిలదీస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో భారత్‌ చిత్తు చిత్తుగా ఓడింది. ఏమాత్రం పోటీ ఇవ్వని భారత్‌ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 93 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించగా…కివీస్‌ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేధించింది.