కోహ్లీ నిర్ణయం నన్ను విస్మయానికి గురి చేసింది: లక్ష్మణ్‌

vvs laxman
vvs laxman

ముంబయి: వెస్టిండీస్‌తో రెండో వన్డేలో టాస్‌ గెలిచిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవడం తనని ఆశ్యర్యానికి గురి చేసిందని భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ అన్నారు. విశాఖలో రాత్రి సమయంలో మంచు కురుస్తుందని తెలిసినా కోహ్లీ ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకోవడం నన్ను విస్మయానికి గురి చేసింది. కాగా జట్టులో ముగ్గురు మంచి స్పిన్నర్లు( చాహల్‌, కుల్దీప్‌, జడేజా) ఉండటంతోనే కోహ్లీ ఈనిర్ణయానికి వచ్చాడేమోననిపిస్తుంది. మరో ఏడు నెలల్లో ప్రారంభం కానున్న ప్రపంచకప్‌ ముందు బౌలర్లు విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అని లక్ష్మణ్‌ అన్నారు.