కోహ్లీ నాకు అత్యంత సన్నిహితుడు: రాహుల్‌

kl

 
న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీ తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని భారత ఆటగాడు కె.ఎల్‌ రాహుల్‌ అన్నారు. గత నాలుగు నెలలుగా జట్టుకు
దూరంగా ఉన్న రాహుల్‌కు త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న టెస్టు జట్టులో స్థానం దక్కిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఒక క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్‌ పై విషయాన్ని వెల్లడించారు. ఈ పర్యటనలో
భారతజట్టు, శ్రీలంకతో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఏకైక టీ20 ఆడనుంది.