కోహ్లీ ఎంపికను వ్యతిరేకించిన మాట అవాస్తవం

Srinivasan
Srinivasan

కోహ్లీ ఎంపికను వ్యతిరేకించిన మాట అవాస్తవం

న్యూఢిల్లీ: విరాట్‌ కోహ్లీని భారత జట్టులోకి 2008లో ఎంపిక చేయడాన్ని తాను వ్యతిరేకించిన మాట అవాస్తవమని బిసిసిఐ మాజీ అధ్యక్షుడు ఎన్‌.శ్రీనివాసన్‌ వెల్లడించాడు. రెండు రోజుల క్రితం టీమిండియా మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ మీడియాతో మాట్లాడుతూ…కోహ్లీని జట్టులోకి ఎంపిక చేయడం అప్పట్లో బిసిసిఐ కోశాధికారిగా ఉన్న శ్రీనివాసన్‌తో పాటు మహేంద్రసింగ్‌ ధోని, కోచ్‌ గ్యారీ కిరిస్టన్‌కి ఇష్టంలేదని… వారు చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు, తమిళనాడుకి చెందిన బద్రీనాథ్‌ని జట్టులోకి తీసుకోవాలని పట్టుబట్టినట్లు చెప్పాడు. వారి ప్రతిపాదనని లెక్కచేయకుండా కోహ్లీకి అవకాశమిచ్చినందుకు తనని చీఫ్‌ సెలెక్టర్‌ పదవి నుంచి శ్రీనివాసన్‌ అప్పట్లో తప్పించాడని వెంగ్‌ సర్కార్‌ ఆరోపించాడు. దీనిపై తాజాగా శ్రీనివాసన్‌ స్పందించాడు.

2008లో జరిగిపో యిన విషయాన్ని వెంగ్‌ సర్కార్‌ ఇప్పుడు ప్రస్తావిం చడం సంస్కారం కాదు. జట్టు ఎంపికలో నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. విరాట్‌ కోహ్లీని ఎంపిక చేయడం వల్లే అతని చీఫ్‌ సెలెక్టర్‌ పదవి పోయిందనడంలో వాస్తవం లేదు. అప్పట్లో అతను ముంబయి క్రికెట్‌ సంఘం ఉపాధ్యక్షుడిగా వెళ్లేందుకు ఆసక్తి కనరబర్చాడు. అందుకే అతడ్ని సెలెక్షన్‌ కమిటీలోకి తీసుకోలేదు. బద్రీనాథ్‌ని పక్కన పెట్టడం వల్లే పదవి పోయిందన్నాడు…? శ్రీలంక పర్యటన కోసం విరాట్‌ కోహ్లీతో పాటు బద్రీనాథ్‌ని కూడా సెలెక్టర్లు ఎంపిక చేసిన విష యం ఇక్కడ వెంగ్‌ సర్కార్‌ మరిచిపోయిన ట్లున్నాడని శ్రీనివాసన్‌ ఘాటుగా స్పందించాడు.