కోహ్లీని వెనక్కి నెట్టిన ధోనీ:

Kohli, Dhoni
Kohli, Dhoni

కోహ్లీని వెనక్కి నెట్టిన ధోనీ:

ద్వితీయ స్థానంలో గంభీర్‌

న్యూఢిల్లీ: ధోని ఒకప్పటి టీమిండియా సారథి.కోహ్లీ ప్రస్తుత సారథిని అని తెలిసిందే.ఈ ఐపిఎల్‌ సీజన్‌లో వీరిద్దరు తమ స్థాయికి తగ్గ ప్రదర్శ నలతో అలరించుకున్నా ఒక విషయంలో మాత్రం నువ్వానేనా అన్నట్లు గా పోటీపడుతున్నారు. అందులో ధోని ఒక్క మెట్లు ముందు ఉండటం విశేషం.ఐపిఎల్‌ పదవ సీజన్‌ను పురస్కరించు కుని నిర్వాహకులు ట్విటర్‌లో ప్రఖ్యాత ఆటగాళ్ల ఎమోజీలు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అభిమానులు వీటిని పోటాపోటీగా వినియో గిస్తున్నారు. దీంతో వరుసగా నాలుగవ వారం లోనూ ధోని ఎమోజీనే అగ్రస్థానంలో నిలిచింది.ఈ వారంలో కోల్‌కతా సారథి గంభీర్‌ రెండవ స్థానం ఆక్రమించాడు.సోషల్‌ మీడియాలో విపరీతమైన పాలోయింగ్‌ ఉన్న కోహ్లీ మూడవ స్థానంలోకి వెళ్లిపోయాడు.ముంబయికి చెందిన రోహిత్‌,పుణేకు చెందిన బెన్‌స్టోక్స్‌ నాలుగు, అయిదవ స్థానాల్లో నిలిచారు.ట్విటర్‌లో ఎక్కువగా చర్చించిన వ్యక్త కూడా ధోనియే కావడం విశేషం. ముంబయి ఇం డియన్స్‌ ప్రాంచైజీ,గుజరాత్‌ లయన్స్‌, ముంబయి ఇండియన్స్‌ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ గురించి అభిమానులు ఎక్కువగా చర్చించారు.