కోహ్లీని అధిగమించిన పాకిస్తాన్‌ ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌

babar azam
babar azam

దుబాయ్‌: ప్రపంచ క్రికెట్‌లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రికార్డుల వేటలో దూసుకెళుతున్న విషయం తెలిసిందే! అయితే అంతర్జాతీయ టీ 20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చే సిన ఆటగాడిగా కోహ్లీ సాధించిన ఘనతను పాకిస్థాన్‌ ఓపెనర్‌ బాబర్‌ ఆజమ్‌ సవరించాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా, ఆజమ్‌ 26 ఇన్నింగ్స్‌లోనే అధిగమించడం విశేషం. సోమవారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన చివరిదైన మూడో టీ20లో బాబర్‌ 58 బంతుల్లో 79 రన్స్‌ చేశాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆజ మ్‌ వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.