కోహ్లీకి అలా.. హర్మన్‌కు ఇలానా?

 Diana Edulji
Diana Edulji

– మహిళల కోచ్‌ అంశంపై సిఒఎ చీఫ్‌ను నిలదీసిన డయానా
న్యూఢిల్లీ : భారత మహిళల క్రికెట్‌ నూతన కోచ్‌ నియామకం కోసం బిసిసిఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరోవైపు సరైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కపిల్‌దేవ్‌, అనుషమన్‌ గైక్వాడ్‌, శాంతారామస్వామిలతో కూడిన అడ్‌హాక్‌ ప్యానెల్‌ను కూడా నియమించారు. అయితే ఇదంతా ఓవైపు సాగుతుండగా మరోవైపు సిఒఎ సభ్యురాలు డయానా ఎడుల్జీ మాత్రం వివాదాస్పద మాజీ కోచ్‌ రమేశ్‌ పొవార్‌నే కొనసాగించాలంటూ సరికొత్త చర్చకు తెరతీసింది. అటు ఈ విషయాన్ని సిఒఎ చీప్‌ వినోద్‌ రా§్‌ు ఇప్పటికే అడ్‌హక్‌ ప్యానెల్‌కు ఈమెయిల్‌ ద్వారా కూడా తెలిపారు. కోచ్‌ విషయంలో మహిళా క్రికెటర్లు బిసిసిఐకి లేఖ రాయడంలో తప్పులేదు. వారు నిజంగా తమ అభిప్రాయాలను వ్యక్తం పరిచారు. కానీ గతంలో కోచ్‌ మార్పు విషయంలో సిఈఒ రాహుల్‌ జోహ్రికి కోహ్లీ నిరంతరం ఎస్‌ఎమ్‌ఎస్‌ లను పంపాడు. అలాగే కోచ్‌ పదవి కోసం నిర్ణీత సమయంలో దరఖాస్తు చేయలేదని రవిశాస్త్రి కోసం గడువును కూకడా పొడిగించారు. దీన్ని నేను అప్పట్లోనే వ్యతిరేకించాను. అందుకే కోచ్‌గా రవిశాస్త్రి ఉండాలని కెప్టెన్‌ కోహ్లీ కోరినప్పుడు.. మహిల కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సూచనను ఎందుకు సమ్మతించరు? కనీసం న్యూజిలాండ్‌ పర్యటన వరకైనా పొవార్‌ను కొనసాగిస్తే కమిటీకి అతడిపై స్పష్టత వస్తుంది. కానీ ఇద్దరు సీనియర్‌ బ్యాటర్స్‌ అభిప్రాయాలను తీసి పారేయడం మంచిది కాదు అని రా§్‌ుకు రాసిన లేఖలో ఎడుల్జీ తెలిపారు.