కశ్మీర్‌పై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు

Shahid afridi
Shahid afridi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది మరోమారు భారత్‌కు వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉందని, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్య సమితి ఎందుకు అడ్డుకోవడం లేదని ట్వీట్టర్‌ వేదికగా ప్రశ్నించాడు. ‘భారత్‌ ఆక్రమించిన కశ్మీర్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం తమ గళాన్ని వినిపిస్తున్న అమాయకప్రజలు అన్యాయంగా, తుపాకీ తూటాలకు మరణిస్తున్నారు.