కప్‌ను చేజార్చుకున్నాం…అయినా సంతోషమే : జులన్‌ గోస్వామి

Julan Goswamy
Julan Goswamy

కప్‌ను చేజార్చుకున్నాం…అయినా సంతోషమే : జులన్‌ గోస్వామి

లార్డ్స్‌: ప్రపంచకప్‌ని తృటిలో చేజార్చుకున్నాం. టోర్నీలో ప్రదర్శనపై భారత మహిళా జట్టు సంతృప్తిగా ఉన్నట్లు ఫాస్ట్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి వెల్లడించింది. లార్డ్స్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ ఓడిపోయిన విష యం తెలిసిందే. ఈమ్యాచ్‌లో జులన్‌ మూడ వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ జట్టుని తక్కువ స్కోరుకి కట్టడి చేసింది.ప్రపంచకప్‌లో మేము ఫైనల్‌ చేరుతామని కనీసం ఎవరూ ఆలోచించి కూడా ఉండరు. తొలి మ్యాచ్‌ నుంచే మా బలాలను మేము విశ్వసిస్తూ గెలుపు కోసం శాయ శక్తులా పోరాడాం. దురదృష్టవశాత్తు కప్‌ గెలవలేకపోయాం కానీ…టోర్నీలో మా ప్రదర్శనపై జట్టు అంతా సంతృప్తిగా ఉంది. ఫైనల్లో భారత్‌కి తొందరగా వికెట్‌ దక్కలేదు. పిచ్‌ పేస్‌ బౌలింగ్‌కు తొలుత సహకరించలేదు. దీంతో లయ అందుకునేందుకు కొంచెది సమయం తీసుకోవాల్సి వచ్చింది. నా వరకు ప్రతి మ్యాచ్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నించా అని జులన్‌ వివరించింది.