ఓపెనర్‌గా అడుగుపెట్టిన పృథ్వీ షా

Prithvi Shaw
Prithvi Shaw

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఐపిఎల్‌లో ఆరంగేట్రం చేసిన ఆటగాడు పృథ్వీ షా. అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత్‌ జట్టుకు పృథ్వీ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. జనవరిలో నిర్వహించిన వేలంలో పృథ్వీని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ సొంతం చేసుకుంది. ఐపిఎల్‌లో సోమవారం మొదటి మ్యాచ్‌ ఆడిన పృథ్వీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా గౌతమ్‌ గంభీర్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. దీంతో ఐపిఎల్‌లో ఓపెనర్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన అత్యంత పిన్నవయస్కుడుగా పృథ్వీ షా చరిత్ర సృష్టించాడు.