ఐపిఎల్‌ 2018…రాజస్థాన్‌ కొత్త పంథా

IPL1

ఐపిఎల్‌ 2018…రాజస్థాన్‌ కొత్త పంథా

న్యూఢిల్లీ: ఐపిఎల్‌ 2018 ఆటగాళ్ల వేలం వచ్చే ఏడాది జనవరి 27, 28న బెంగుళూరులో జరగనుంది. అయితే వేలం కంటే ముందే…ఐదుగురు ఆటగాళ్లని ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకునే అవకాశం లభించడంతో ఇప్పటికే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తాము అట్టిపెట్టుకునే క్రికెటర్ల జాబితాని ప్రకటిం చింది. కానీ, రాజస్థాన్‌ రాయల్‌్‌స మాత్రం…ఇప్పటి వరకు ఎవరిని తాము వేలంలోకి వెళ్లకుండా తమ వద్దే ఉంచుకుంటామో చెప్పకుండా అలానే ఉండిపోయింది.

2015లో ఆడిన జట్టులో నుంచి ఐదుగురు ఆటగాళ్లను తమ వద్దే అట్టిపెట్టుకునే అవకాశాన్ని చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌కి ఇటీవల జరిగిన సమావేశంలో ఐపిఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ (జిసి) ఇచ్చింది. ఈ రెండు జట్లు 2016, 2017 సీజన్‌లో నిషేధానికి గురై…మళ్లీ 2018లో పునరాగమనం చేయనున్న విషయం తెలిసిందే. జిసి నిర్ణయించిన ప్రకారం ముగ్గుర్ని రిటేన్‌ చేసుకుని, రైట్‌ టు మ్యాచ (ఆర్‌టిఎం) కార్డు ద్వారా మరో ఇద్దర్ని తీసుకోవచ్చు. లేదంటే ఇద్దర్ని రిటేన్‌ చేసుకుని, ముగ్గుర్ని ఆర్‌టిఎం ద్వారా అట్టిపెట్టుకోవచ్చు. అన్ని ఫ్రాంచైజీలకు ఇది వర్తిస్తుంది. అయితే…అట్టిపెట్టుకునే ఐదుగురు ఆటగాళ్లలో ముగ్గురు భారత్‌, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండాలి. ఒకవేళ ఫ్రాంచైజీలు ఎవర్ని అట్టిపెట్టుకుంటే…2018 వేలంలో వాళ్లకు మూడు రైటు టు మ్యాచ్‌ కార్డు అవకాశాలు లభిస్తాయి. ఈ అవకాశాన్ని రాజస్థాన్‌ రాయల్స్‌ సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తోంది. ఎవరినీ అట్టిపెట్టుకోకుండా…రైట్‌ టు మ్యాచ్‌ ద్వారా అజింక్య రహానె, స్టీవ్‌ స్మిత్‌ తీసుకోవాలని నిర్ణయించిందట. ఆర్‌టిఎం ముఖ్య ఉద్దేశ్యం….వేలంలో తమ ఫ్రాంచైజీకి చెందిన ఆటగాడిని రెండో ఫ్రాంచైజీ కొనుగోలు చేసినప్పుడు ఆర్‌టిఎం ద్వారా అతన్ని తీసుకోవచ్చు. అయితే వేలంలో రెండో ఫ్రాంచైజీ అతనికి ఎంత డబ్బు ఇస్తుందో ఆ మొత్తాన్ని మొదటి ఫ్రాంచైజీ చెల్లించాలి.