ఐపిఎల్‌లో 50వ సెంచరీ నమోదు

RISHAB PANTH
RISHAB PANTH

ఐపిఎల్‌లో 50వ సెంచరీ నమోదు, 50వ శతకం చేసిన రిషబ్‌ పంత్‌

పదేళ్లు దాటి పదకొండో సీజన్‌లో అడుగుపెట్టినా ఐపిఎల్‌లో క్రేజ్‌ మాత్రం తగ్గట్లేదు. లీగ్‌ ఆరంభం నుంచి రికార్డుల మోత మోగిస్తున్న ఆటగాళ్లతో ఐపిఎల్‌ అంతటి ఖ్యాతిని సంపాదించింది. దూకుడుగా ఆడుతూ 20 ఓవర్లకే భారీ స్కోరును నమోదు చేస్తున్న జట్టు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన ఐపిఎల్‌కు ప్రధాన ఆకర్షణలు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అర్థ సెంచరీలకైతే కొదవలేదు. కానీ, సెంచరీలు మాత్రం అరుదుగా నమోదవుతాయి. ఇప్పటివరకు ఐపిఎల్‌లో మొత్తం 50 సెంచరీలు నమోదయ్యాయి. ప్రస్తుత ఐపిఎల్‌ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఆటగాడు 63 బం తుల్లో 128 పరుగులు సాధించాడు.

ఈ సెం చరీతోనే ఐపిఎల్‌లో ఇప్పటివరకు 50వ సెంచరీ పూర్తి చేసకుంది. ఐపిఎల్‌ చరిత్రలోనే 50వ సెంచరీ చేసే అవకాశం దక్కిన ఆటగాడిగా రిషబ్‌ పంత్‌ రికార్డు సృష్టించాడు. అంతేగాక అధిక వ్యక్తి గత పరుగులు సాధించిన భారతీయ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 2010లో మురళీ విజ§్‌ు 56బంతుల్లో 127 పరుగులు చేయగా…పంత్‌ ఆ రికార్డును అధిగమించాడు. ఈ సీజన్‌లో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా పంత్‌ నిలి చాడు. జనవరిలో పంత్‌ 32బంతుల్లోనే సెంచరీ సాధించి వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపిఎల్‌లో ఇప్పటివరకు 12మంది భారత ఆటగాళ్లు సెంచ రీలు బాదగా రిషబ్‌ పంత్‌ 13వ వాడిగా ఆ జాబితాలో చేరాడు. 2008లో ఆరు సెంచరీలు: కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో 158 పరు గులుతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇదే ఐపిఎల్‌లో మొదటి సెంచరీ 2008లో మొత్తం 6 సెంచరీలు నమోదయ్యాయి. 2009లో రెండు సెంచరీలు: కేవలం ఇద్దరు ఆట గాళ్లు మాత్రమే సెంచరీలు సాధించారు. వారిద్దరూ ఎవరంటే ఎబి డివిలియర్స్‌, మనీశ్‌ పాండే. 2010లో నాలుగు సెంచరీలు: రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకు ఆడిన యూసఫ్‌ పఠాన్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ డేవిడ్‌ వార్నర్‌, మురళీ విజ§్‌ు, మహేలా జయవర్ధనేలు సెంచరీలు చేశారు. 2011లో ఆరు సెంచరీలు, 2012లో ఆరు సెం చరీలు, 2013లో ఆరు సెంచరీలు, 2014లో మూడు సెంచరీలు, 2015లో నాలుగు సెంచ రీలు, 2016లో ఏడు సెంచరీలు, 2017లో ఐదు సెంచరీలు నమోదయ్యాయి. 2016లో అధికంగా సెంచరీలు: అత్యధిక ఏడు సెంచరీలు 2016లో నమోదయ్యాయి. ఈ సీజ న్‌లో విరాట్‌ కోహ్లీనే నాలుగు సెంచరీలు సాధిం చడం విశేషం. ఈఏడాది ఐపిఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు (మే 10 నాటికి) మూడు సెంచరీలు నమోదయ్యాయి.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆట గాడు క్రిస్‌ గేల్‌…సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై సెంచరీల చేసి ఈ సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌…రాజస్థాన్‌ రాయల్స్‌పై, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఆటగాడు రిషబ్‌ పంత్‌ సన్‌రై జర్స్‌ హైదరాబాద్‌పై సెంచరీలు నమోదు చేశాడు. భారత క్రికెట్‌ భవిష్యత్‌ ఆశాకిరణం అతడే: గంగూలీ: యువ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ త్వరలో టీమిండి యాకు ప్రాతినిధ్యం వహిస్తాడని మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ జోస్యం చెప్పాడు. ఫిరోజ్‌ షా కోట్ల వేదికగా గురువారం రాత్రి సన్‌రైజర్స్‌ హైద రాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ (63 బంతుల్లో 15ఫోర్లు, 7 సిక్సర్లతో 128 నాటౌట్‌) తో ఐపిఎల్‌లో సరికొత్త రికార్డు సృష్టించడంతో పదేళ్ల ఐపిఎల్‌ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ సందర్భంగా సౌరవ్‌ గంగూలీ మాట్లాడుతూ రిషబ్‌ పంత్‌ భారత ఆశాకిరణం.

అతనే కాదు…రెండు రోజుల క్రితం కోల్‌కతా 21 బంతుల్లో 62 పరుగులు చేసిన ముంబై యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కి కూడా మంచి భవిష్యత్‌ ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ ఇద్దరూ టీమిం డియాకి ఆడతారని గంగూలీ అన్నాడు.వారిద్దరూ ఇంకా యువకులు కాబట్టి తొందరలేదు. ఎందు కంటే ఆటలో దూకుడు కంటే, నిలకడ చాలా ముఖ్యం. అందుక వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడి వారు పరిపక్వత సాధించాలి. ఇషాన్‌ కిషన్‌ ఆటని చూసిన తర్వాత, అతని గురించి చది వాను. టీమిండియాకు ఎంపిక చేసేటప్పుడు క్రికెటర్‌ నిలకడని ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపాడు. ఎన్నిసార్లు సదరు ఆక్రికెటర్‌ మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆడాడో సెలెక్టర్లు పరిశీలిస్తారు. ఐపిఎల్‌ ఆరంభ సీజన్‌లో మెక్‌క ల్లమ్‌ మెరుపు సెంచరీని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌ నుంచి నేను చూశాను. రిషబ్‌ పంత్‌ గురువారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఆడిన ఇన్నింగ్స్‌ నిజం గా అద్భుతమని సౌరవ్‌ గంగూలీ కొనియాడాడు.
======